ఇవాళ నంద్యాల విజయ డెయిరీ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, విపక్షాలు

విజయ డైరీని సొంతం చేసుకునే దిశగా అధికార పక్షం ఎన్నికలకు సిద్దమైంది.

ఇవాళ నంద్యాల విజయ డెయిరీ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, విపక్షాలు
Follow us

|

Updated on: Jan 27, 2021 | 8:27 AM

Vijaya dairy Elections :  25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం ఎలా? ఇదీ సీపీ నేతలచాలెంజ్. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా.. అక్కడ మాత్రం పాగా వేయలేకపోయారు. ఇప్పుడు విజయ డైరీని సొంతం చేసుకునే దిశగా అధికార పక్షం ఎన్నికలకు సిద్దమైంది. దీంతో కర్నూలు జిల్లా విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకు చాలెంజింగ్‌గా మారాయి. ఇవాళ నంద్యాల విజయ డెయిరీ మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 81 మంది సభ్యులు ఉండగా… ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, అనంతరం ఛైర్మన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగనున్నాయన్నారు.

కాగా, ఈ ఎన్నికలను మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 25 ఏళ్లుగా భూమా కుటుంబానికి ఏకగ్రీవంగా చైర్మన్ పదవి దక్కుతుంది. అయితే, ఈసారి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 25 ఏళ్లుగా చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి పోటీ అనివార్యం కావడంతో చైర్మన్ అభ్యర్థిగా బరిలో అఖిలప్రియ మేనమామ ఎస్. వి. జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిచారు.

Read Also… ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో