Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 27, 2021 | 6:59 AM

Kalyanadurgam former MLA : కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం బత్తలపల్లి ఆర్‌డీటీ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆర్‌డీటీ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999 2004 మధ్య కాలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యురాలుగా తెలుగుదేశం పార్టీ తరుపున శారదాంబ ఎన్నికైయ్యారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు శారదాంబ. ఈమె మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.

Read Also.. Petrol, Diesel Prices : మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?