Krishna Water War: మళ్లీ జల జగడం.. తెలంగాణపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఏపీ..

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి అవసరాలు లేకపోయినప్పటికీ.. శ్రీశైలం నుంచి తెలంగాణ జన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగివకు నీటిని విడుదల చేస్తోందని ఏపీ ప్రభుత్వం

Krishna Water War: మళ్లీ జల జగడం.. తెలంగాణపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఏపీ..
Krishna River Management Board
Follow us

|

Updated on: Oct 01, 2022 | 12:56 PM

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి అవసరాలు లేకపోయినప్పటికీ.. శ్రీశైలం నుంచి తెలంగాణ జన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగివకు నీటిని విడుదల చేస్తోందని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై తెలంగాణ కూడా సీరియస్‌‌గా స్పందించే అవకాశం ఉంది. అయితే.. ఇరు రాష్ట్రాలు.. ఫిర్యాదు చేసుకున్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తునే ఉన్నాయి. దీంతో శ్రీశైలం నీటిమట్టం శరవేగంగా పడిపోతుంది. దీనికి తగ్గట్టు శ్రీశైలంకు నీటి చేరిక కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య జల జగడం పీక్‌కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195 టీఎంసీలకు ఉంది.ఇన్‌ ఫ్లో లక్ష క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ కు నీటి అవసరాలు లేనప్పటికీ తెలంగాణ జెన్కో నీటిని దిగువకు విడుదల చేస్తుండటం ఫిర్యాదుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో పాటు కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులకు నీటి విడుదల ఉండటంతో శ్రీశైలం నీటిమట్టం భారీగా తగ్గిపోతుంది.

కాగా.. ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాల పంపిణీ అంశం జాతీయ స్థాయిలో పంచాయితీ నడుస్తోంది. ఇరు రాష్ట్రాలను కేంద్రం సమన్వయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నప్పటికీ వివాదాలు కొలిక్కిరాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కృష్ణా నదిలో నీటి కేటాయింపు, వినియోగం అంశంపై ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికే కేఆర్ఎంబీలో వాదనలు నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరోసారి ఏపీ తెలంగాణపై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..