AP Anganwadi Jobs 2022: ఏపీ అంగన్‌వాడీ నోటిఫికేషన్‌ రద్దు? అప్పుడే తుది నిర్ణయం వెల్లడించేది..

అంగన్వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 నియామకం నోటిఫికేషన్‌ రద్దు చేసే అవకాశం ఉందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ చీఫ్‌ సెక్రెటరీ అనురాధ శుక్రవారం (సెప్టెంబర్‌ 30) మీడియాకు వెల్లడించారు..

AP Anganwadi Jobs 2022: ఏపీ అంగన్‌వాడీ నోటిఫికేషన్‌ రద్దు? అప్పుడే తుది నిర్ణయం వెల్లడించేది..
Andhra Pradesh
Follow us

|

Updated on: Oct 01, 2022 | 1:24 PM

అంగన్వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 నియామకం నోటిఫికేషన్‌ రద్దు చేసే అవకాశం ఉందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ చీఫ్‌ సెక్రెటరీ అనురాధ శుక్రవారం (సెప్టెంబర్‌ 30) మీడియాకు వెల్లడించారు. రద్దు విషయంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని, హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను నిలుపుదల చేశామని అన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55,607 అంగన్‌వాడీలుండగా.. నిబంధనల ప్రకారం ప్రతి 25 అంగన్వాడీలకు ఒక సూపర్‌ వైజర్‌ ఉండాలి. ప్రస్తుతం అంతర్గతంగా చేపట్టిన నియమాక నోటిఫికేషన్‌లో 60 అంగన్వాడీలకు ఒక సూపర్‌ వైజర్‌ మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీగా ఉన్న 560 అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నియామక పరీక్షకు దాదాపు 21,000ల మంది అంగన్‌వాడీలు హాజరయ్యారు.

మొత్తం 50 మార్కులకుగానూ 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు స్పోకెన్‌ ఇంగ్లీష్ టెస్ట్‌ నిర్వహించారు. 1 : 2 నిష్పత్తిలో 1,194 మందిని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ టెస్టుకు ఎంపికచేశారు. వీరికి 3 నుంచి 5 నిముషాల నిడివితో స్పోకెన్‌ ఇంగ్లిష్ వీడియోలు రికార్డు చేశారు. ఇంత మంది వీడియోలు చూడటం కష్టమని భావించిన అధికారులు.. మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే స్పోకెన్‌ ఇంగ్లీష్ విడియోలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. దీంతో అభ్యర్ధుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఐతే రాతపరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థుల జాబితాను మాత్రమే పంపించి సీడీపీవోల ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీషు వీడియెలను తెప్పించి మూల్యాంకనం చేశామని, ఇప్పటికే రాత పరీక్ష మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చీఫ్‌ సెక్రటరీ అనురాధ అన్నారు. ఒకవేళ నోటిఫికేషన్‌ రద్దు చేసే అవకాశం ఉంటే.. ప్రశ్నపత్రంలో ఏమైనా మార్పులు తీసుకురావాలా? ఆంగ్లంలో ప్రావీణ్యాన్ని ఎలా పరీక్షించాలి అనే అంశాలపై చర్చిస్తున్నట్లు ఆమె తెలిపారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!