Govt Jobs: బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సెంట్రల్ యూనివర్సిటీలో పలు టీచింగ్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సెంట్రల్ యూనివర్సిటీలో పలు టీచింగ్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషనలో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్, వీడియో కెమెరా పర్సన్, వీడియో ఎడిటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎకనామిక్స్, మైక్రో బయాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/బీఎస్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/మాస్టర్స్ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్ సెల్), సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, ఎన్ హెచ్- 8, బందర్ సింద్రీ, క్రిష్ణానగర్, డిస్ట్రిక్ట్ – అజ్మీర్, 305817 (రాజస్థాన్) అడ్రస్‌కు పంపిచాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 12-10-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..