Appsc Recruitment: ఏపీపీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్.. రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వరుసగా నోటిఫికేషన్లను వడుదల చేస్తే వస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏపీలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వరుసగా నోటిఫికేషన్లను వడుదల చేస్తే వస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏపీలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 12/2022 (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) నోటిఫికేషన్ కింద 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా రవాణా శాఖలో ఉన్న 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థ/లు మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 21 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 31,460 నుంచి రూ. 84,970 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 02-11-2022న మొదలవుతుండగా, 22-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..