HCL Recruitment: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే కోల్‌కతాలో ఉన్న ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే కోల్‌కతాలో ఉన్న ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి.
* మైనింగ్, సర్వే, జియాలజీ, కాన్సంట్రేటర్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సిస్టమ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్-2022/ గేట్-2021 స్కోర్ కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-09-2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 10-10-2022న మొదలై 31-10-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..