Upper age limit: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! నాన్ యూనీఫాం ఉద్యోగాలకు వయోపరిమితి మరోసారి పొడిగించిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్లు కొంత నిరాశకు గురి చేశాయి. ఎందుకంటే సదరు నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. ఇప్పటికే గ్రూప్1 నోటిపికేషన్‌తో సహా, పలు గ్రూప్ 4 పోస్టులకు, మెడికల్ పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది.
ఐతే ఈ ప్రభుత్వ శాఖల్లోని నాన్-యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి గడువును మరో ఏడాది పెంచుతూ ఏపీ సర్కార్ సెప్టెంబరు 30న ఉత్తర్వులు జారీచేసింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, నిరుద్యోగులకు ఇది కొంత ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇప్పటికే 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచిన వయో పరిమితి గడువు సెప్టెంబరు 30తో ముగిసింది. ఐతే తాజా ఉత్తర్వులతో దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు ఏపీ ఏపీ ప్రభుత్వం పొడిగించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.