పొత్తు వద్దని ఒకరు.. ఫర్వాలేదని మరొకరు.. జనసేనానికి కొత్త పంచాయితీ.!
కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా.. ఏదో ఒకటి తేల్చుకో అని వార్నింగ్ ఇస్తే దేన్ని ఎంచుకుంటాం. పవన్ కల్యాణ్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు. ఓ ములాఖత్ ముహూర్తాన టీడీపీతో కలిసి వెళ్తామని పొత్తును కన్ఫామ్ చేసేశారు పవన్ కల్యాణ్. చూడ్డానికి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపించినా..
కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా.. ఏదో ఒకటి తేల్చుకో అని వార్నింగ్ ఇస్తే దేన్ని ఎంచుకుంటాం. పవన్ కల్యాణ్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు. ఓ ములాఖత్ ముహూర్తాన టీడీపీతో కలిసి వెళ్తామని పొత్తును కన్ఫామ్ చేసేశారు పవన్ కల్యాణ్. చూడ్డానికి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపించినా.. బాగా స్టడీ చేసిన తరువాతనే ఆ డెసిషన్ తీసుకున్నానని చెప్పారు. కాని, పవన్ కల్యాణ్‌పై ఆశలు పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఆయన సీఎం కావాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గం. అందుకే, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, సీట్లను సర్దుబాటు చేసుకుంటామని చెప్పగానే.. కాపు వర్గంలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా ఎలా కుదురుతుంది.. ఒంటరిగానే సత్తా చాటాలి కదా అంటూ ఓ మీటింగ్ పెట్టుకుని మరీ అల్టిమేట్టం ఇచ్చారు. కాకినాడ వేదికగా ఆ మీటింగ్ జరిగింది. స్థానిక కాపు సంఘం నేతలతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నేతలు హాజరైన ఆ సమావేశంలో ఓ తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలనేది ఆ తీర్మానం సారాంశం. పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే పార్టీ ఎప్పటికీ ఎదగదని సలహా ఇచ్చారు. అందుకే, టీడీపీ కాదు కదా మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. ఒకవేళ ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తే గనక.. కాపులందరూ జనసేనకే ఓటు వేసి గెలిపించాలని ఓ పిలుపు కూడా ఇచ్చారు. కాదూ కూడదని పొత్తులతోనే వెళ్తే గనక కాపుల మద్దతు ఉండబోదని తేల్చి చెప్పేశారు.
ఇంతకీ పొత్తు ఎందుకు వద్దంటున్నారు? పొత్తు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఈ ప్రశ్నలకు ఎన్నాళ్లగానో వినిపిస్తున్న లాజికల్ ఆన్సరే ఇస్తున్నారు కాపు సంఘం నేతలు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నంత కాలం చంద్రబాబే సీఎం. అదే.. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. కాని, ఇదే కాపు సామాజికవర్గంలోని మరో వర్గం పవన్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లు అలాగే అంటారు గానీ.. పొత్తు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మరో వర్గం కాపు నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం తరువాత సంగతి.. ముందుగా అసెంబ్లీలో అడుగుపెట్టి, ఆ తరువాత అధికారం పంచుకోవాలి అనేదే టార్గెట్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పైగా పొత్తు పెట్టుకోవద్దని పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చిన వారికి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు మరో వర్గం వాళ్లు. కాకినాడలో మీటింగ్ పెట్టుకున్న వాళ్లందరూ వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్లేనంటూ కౌంటర్ ఇచ్చారు. ముందుగా ఆ పార్టీకి రాజీనామా చేసి, అప్పుడు స్వచ్ఛందంగా వచ్చి పవన్‌కు సలహా ఇవ్వాలని సూచించారు.
ఓ ప్రత్యేక అజెండాతోనే ఒంటరిగా వెళ్లమని సలహా ఇస్తున్నారనేది మరో వర్గం కాపు నేతల వర్షన్. ప్రస్తుత పరిస్థితుల్లో పాలకపక్షాన్ని ఎదుర్కోవాలంటే పొత్తులు తప్ప మరో దారి లేదనేది పవన్‌కు మద్దతు ఇస్తున్న వారి వాదన. అందుకే, టీడీపీతో కలిసి వెళ్లాలనే నిర్ణయానికి మద్దతిస్తున్నామని, పవన్‌కు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని చెబుతున్నారు.
జనసేన ఒంటరిగా పోటీ చేయాలి, పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలి. ఇదే కొందరు కాపు సామాజికవర్గ నేతల అభిలాష. బాగానే ఉంది గానీ.. 2019లో ఏం జరిగిందో మరిచిపోయారా అనేది మరో వర్గం కౌంటర్. ఎంతో నమ్మకంతో రెండు స్థానాల్లో పోటీ చేస్తే.. కనీసం ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయాం కదా, అసెంబ్లీ గేటు తాకే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. మరి ఏ నమ్మకంతో మళ్లీ ఒంటరిగా పోటీ చేయమంటున్నారనేది మరో వర్గం వారి వాదన. అయితే, 2019 ఎన్నికలకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నది ఒంటరి పోటీకి మద్దతిచ్చే వారు చెబుతున్న లాజిక్. ప్రస్తుతం ప్రతి గ్రామంలో జనసేన పార్టీకి ఆఫీసులు ఉన్నాయని, కాపులలోనూ బాగా చైతన్యం వచ్చిందని చెబుతున్నారు. అందుకే, ఇపుడు గనుక పవన్ ముఖ్యమంత్రి కాలేకపోతే భవిష్యత్తులో అవడం కూడా కష్టమే అనేది వీరి అభిప్రాయం. మొత్తానికైతే ఎవరి వర్షన్స్ వాళ్లకు ఉన్నాయి. ఒంటరిగా వెళ్లి ఓడిపోమంటారా అని ఒకరు, పవన్‌కు సీఎం కుర్చీ దూరం చేస్తారా అని మరికొందరు కీచులాడుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ వర్షన్ కూడా ఒకటి ఉంటుంది కదా. ఆయన చెబుతున్నది ఒక్కటే.. గత ఎన్నికల్లో అన్నోఇన్నో సీట్లు, బలమైన ఓటు షేర్ వచ్చి ఉంటే.. మీరన్నట్టే ఏకంగా సీఎం సీటే అడిగేవాడిని అన్నారు పవన్ కల్యాణ్. అందుకే, 2024 టార్గెట్ ఏంటో చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు. ముందైతే అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లో అడుగుపెట్టాలి, రాజకీయంగా పుంజుకోవాలి, ఆ తరువాతే మిగతావి ఆలోచించాలనేది పవన్ ఆలోచన. మరి, పవన్ నిర్ణయాన్ని గౌరవిస్తారో, నిర్ణయం మార్చుకునేలా ఆయనలో నమ్మకాన్ని పెంచుతారో చూడాలి.