ఏంట్రా బాబు ఇలా తయారయ్యారు.. నకిలీ వేలిముద్రలతో బ్యాంక్ అకౌంట్లో నగదు స్వాహా
నకిలీ వేలిముద్రలోతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బలు కొల్లగొడుతున్న అయిదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 416 సైబర్ నేరాలకు పాల్పడి.. దాదాపు రూ.5.9 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. అయితే వారివద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారి లక్షకు పైగా వేలిముద్రలు, ఆధార్ కార్ట్ నంబర్లతో సహా ఇతర వ్యక్తిగత సమాచారం ఉండటం కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ బుధవారం ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

నకిలీ వేలిముద్రలోతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బలు కొల్లగొడుతున్న అయిదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 416 సైబర్ నేరాలకు పాల్పడి.. దాదాపు రూ.5.9 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. అయితే వారివద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారి లక్షకు పైగా వేలిముద్రలు, ఆధార్ కార్ట్ నంబర్లతో సహా ఇతర వ్యక్తిగత సమాచారం ఉండటం కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ బుధవారం ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. కడప జిల్లాలోని రామాంజనేయపురం అనే ప్రాంతంలో ఎలక్ట్రికల్ కాలనీకి చెందిన ఎస్. శంకరయ్య అనే వ్యక్తి మొబైల్‌ఫోన్‌కు ఎలాంటి ఓటీపీ రాకుండానే ఆయన బ్యాంకు ఖాతా నుంచి 5,500 రూపాయలు విత్‌డ్రా అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో ఆయన 2022 డిసెంబర్ 13న కడప సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కేసు నమోదు చేశారు.
అయితే రెండు రోజుల క్రితమే వెంకటేష్ అనే వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా బాధితుడు శంకరయ్యకు ఫోన్ చేశాడు. నువ్వు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో నా బ్యాంకు ఖాతా జప్తు చేశారని అన్నారు. నా ఖాతాను తిరిగి యాథాస్థితికి తీసుకురాకుంటే నిన్ను చంపేస్తా అంటూ బెదిరించాడు. అలాగే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై ఏఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. అయితే ఈ సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్డ్ పేయిమెంట్ అనే సిస్టమ్ ద్వారా బాధితుల వేలిముద్రలను బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లు, బ్యాంకు కస్టమర్ సర్వీసు పాయింట్ల నుంచి సేకరించి.. వాటిని కంప్యూటర్‌లో నకిలీలు తయారు చేశారు. ఆ తర్వాత వాటి సహాయంతో బాధితుల ఆధార్ కార్టులకు లింకున్నటువంటి బ్యాంకు డబ్బులు డ్రా చేస్తున్నారు.
అయితే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారిపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో శంకరయ్య ఖాతా నుంచి రూ.5,500 డ్రా అయినట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితుడికి వచ్చిన కాల్‌డేటా ఆధారంగా అనుమానితుడ్ని లోకేషన్ గుర్తించారు. దీంతో అతడు కడపలో ఉన్నట్లు తెలిసింది. కడప పాతబైపాస్ వద్ద ప్రకాశం జిల్లా దోర్నాల మండలం సుందరయ్య కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు నల్లగళ్ల వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాదే అతనికి సహకరించిన గుంటులోని శ్రీనివాసపేటకు చెందిన మల్ల అజయ్, గంట కల్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీలను కూడా అరెస్టు చేశారు. ఈ నిందితుల నుంచి నకిలీ వేలిముద్రల తయారీ పరికరాలను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్, కారు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసును ఛేదించినటువంటి పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




