Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు జిల్లాల్లో నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఉమ్మడి వ్యూహం.. చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ నిఘా!

ఆంధ్ర, ఒరిస్సా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం అంటే నేరాలకు అడ్డాగా ఉంటోంది. గంజాయి, లిక్కర్, ఖనిజ వనరుల అక్రమ రవాణాకు రాజమార్గం అవుతోంది. అంతేకాదు మావోయిస్టులు తలదాచుకునేందుకు సెఫేస్ట్ ప్లేస్ గాను ఉంటోంది. మావోయిస్టులు ఆంధ్రాలో విధ్వంసం సృష్టించి సరిహద్దులు దాటివచ్చి కొద్దిరోజులు ఒరిస్సాలో తలదాచుకునేవారు..

Andhra Pradesh: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు జిల్లాల్లో నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఉమ్మడి వ్యూహం.. చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ నిఘా!
Srikakulam District Police
Follow us
S Srinivasa Rao

| Edited By: Srilakshmi C

Updated on: Dec 31, 2023 | 7:44 AM

శ్రీకాకుళం, డిసెంబర్ 31: ఆంధ్ర, ఒరిస్సా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం అంటే నేరాలకు అడ్డాగా ఉంటోంది. గంజాయి, లిక్కర్, ఖనిజ వనరుల అక్రమ రవాణాకు రాజమార్గం అవుతోంది. అంతేకాదు మావోయిస్టులు తలదాచుకునేందుకు సెఫేస్ట్ ప్లేస్ గాను ఉంటోంది. మావోయిస్టులు ఆంధ్రాలో విధ్వంసం సృష్టించి సరిహద్దులు దాటివచ్చి కొద్దిరోజులు ఒరిస్సాలో తలదాచుకునేవారు. ఒరిస్సాలో విధ్వంసం చేసి ఆంధ్రాలో తలదాచుకునే వారు. పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ లు నిర్వహించినా.. ఏ రాష్ట్ర పోలీసుల కూంబింగులు ఆ రాష్ట్ర సరిహద్దుల వరుకే పరిమితమవుతూ వచ్చేవి. అయితే ఇటువంటి నేరాలకు చెక్ పెట్టే దిశగా ఇరు రాష్ట్రాల పోలిసులు సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అంతరాష్ట్ర సమన్వయ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ సరిహద్దు ప్రాంతంలో పోలీసుల నిఘాను పటిష్ఠం చేస్తున్నారు.

తాజాగా శనివారం శ్రీకాకుళంలో అంతరాష్ట్ర సమన్వయ సమీక్ష సమావేశo జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం, ఒరిస్సా లోని బరంపుర్, గజపతి, గంజాం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. పోలీసు అధికారులు సమన్వయంతో సమిష్టిగా సరిహద్దులో జరగుతున్న నేరాలను అరకట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలు నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో బరంపుర్ ఎస్పీ శరవణ వివేక్ ఎం గజపతి, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమారిలతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అంతరాష్ట్ర సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాం ఎస్పీ శరవణ వివేక్ ఎం వర్చువల్ విధానం ద్వార బరంపుర్ నుంచి పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్ ఎన్.బి.డబ్ల్యు రైడ్స్, పాత నేరస్థులు, చెక్ పోస్టు, అక్రమ మద్యం, మెడికో లీగల్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ..

శ్రీకాకుళం జిల్లా సుమారుగా 115 కిలోమటర్లు సరిహద్దును గజపతి, గంజాం జిల్లాలతో కలిగుందన్నారు. 8 పోలీసు స్టేషన్లు, 6 సెబ్ పోలీస్ స్టేషన్లు సరిహద్దులో జరగుతున్న నేరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాన్నమని తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో 53 గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జరగుతుండడం గుర్తించామని, ఆయా గ్రామాల్లో సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తీ స్థాయిలో నిర్మూలించేందేకు సహకరించాలని ఎస్పీ కోరారు. ముందుస్తు సమాచారాన్ని సేకరించి స్థావరాలపై సమన్వయంతో ఆకస్మిక దాడులు నిర్వహించాలన్నారు. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

రానున్న ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులపై నిఘా ఉంచి బైండ్వర్లు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు నాలుగు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, ఆయా చెక్‌ఫోస్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండి స్పెషల్ పార్టీ సిబ్బందిని కేటాయించి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. మూడు జిల్లాల సరిహద్దులలో ఏటువంటి అక్రమ రవాణా, నేరాలు, దొంగతనాలు జరగకుండా సమన్వయంతో సమిష్టిగా పనిచేసి నేర రహిత జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించుకుందామని ఎస్పీ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.