AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: భారీ లక్ష్యంతో చంద్రబాబు కుప్పం టూర్‌.. 3 రోజులు ఇలా సాగింది.

కుప్పం పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎదురెళ్లి స్వాగతం పలకడం, చంద్రబాబు మాటా మంతి పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా కూడా మారింది. అనంతరం గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభ లో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. క్రీడా మైదానాలు లేకపోయినా ఆడుదాం ఆంధ్ర అంటూన్నారంటూ అధికారపక్షంపై..

Chandrababu: భారీ లక్ష్యంతో చంద్రబాబు కుప్పం టూర్‌.. 3 రోజులు ఇలా సాగింది.
Chandrababu Naidu
Raju M P R
| Edited By: |

Updated on: Dec 31, 2023 | 8:49 AM

Share

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పర్యటన కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. స్కిల్ కేసులో డెవలప్‌మెంట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబును చూసేందుకు జనం ఎగబడ్డారు. ఇక లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు కుప్పం పర్యటన సాగింది. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొని కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు తొలిరోజే ఏపీ కర్ణాటక సరిహద్దులో పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర సరిహద్దు గ్రామం బిషానత్తం వద్ధ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన ప్రారంభమైంది.

కుప్పం పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎదురెళ్లి స్వాగతం పలకడం, చంద్రబాబు మాటా మంతి పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా కూడా మారింది. అనంతరం గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభ లో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. క్రీడా మైదానాలు లేకపోయినా ఆడుదాం ఆంధ్ర అంటూన్నారంటూ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. కుప్పం‌ నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, 5 ఏళ్లలో నియోజకవర్గంలో‌ వైసీపీ సర్కార్ ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదన్నారు.

రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తానన్న చంద్రబాబు, జిల్లాకు చెందిన మైనింగ్ మంత్రి ఇసుక, మద్యం, భూములు, గ్రానైట్ లో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అరాచకశక్తులను అంతం చేయాలంటే ఇంటికొకరు ముందుకురావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఉపాధిహామీ వైసీపీ కార్యకర్తలకు మేతగా మారిందని విమర్శించారు. వందల కోట్లు కొల్లగొడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీలో సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక ఆడుదాం ఆంధ్రుడా కార్యక్రమానికి.. దోచుకుందాం దాచుకుందామని పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. వచ్చే వంద రోజులు తన కోసం పనిచేయండని పిలుపునిచ్చిన చంద్రబాబు అత్యధిక ఓట్లతో కుప్పంలో గెలిపించమని ప్రజలను కోరారు. ఇక కుప్పం రెండో రోజు పర్యటన శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సాగింది. కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న తర్వాత కుప్పంలో జరుగుతున్న సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో జరుగుతున్న చంద్రబాబు ఇంటి నిర్మాణంపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల తో ఆరా తీశారు.

హంద్రీ నీవాలో నీళ్ళు పారించమంటే, అవినీతి పారిస్తున్నారని జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందరూ రోడ్డున పడ్డారని సీఎం మాత్రం పాలెస్‌లో ఉన్నారన్నారు. వాటాలు అడుగుతున్న కారణంగా పెట్టుబడులు రావడం లేదన్నారు. ఓడిపోతున్నట్లు జగన్ కి అర్ధం అయ్యుందని, తిరుగుబాటు మొదలైందన్నారు.

ఇక మూడో రోజు పర్యటనలో జన సేన శ్రేణులతో సమావేశం అయ్యారు. తొలుత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన చంద్రబాబు పీఈఎస్ లో కనకదాసు విగ్రహ ఆవిష్కరించారు. అనంతరం పిఇఎస్ నుంచి తంబిగానిపల్లి వరకు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కుప్పం బస్ స్టాండ్ లో అన్న కాంటీన్ వద్ద పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కొత్తపేట పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. కొత్తపేట పెద్ద మసీదు లో మైనారిటీలతో దువాలో పాల్గొని అక్కడే సమావేశం నిర్వహించారు. కుప్పంలో ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలను పరామర్శించిన చంద్రబాబుకు తమ డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అంగన్ వాడీలు అందచేశారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవన్న చంద్రబాబు.. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మరో వంద రోజుల్లో ప్రభుత్వం వస్తుందని డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తాననిహామీ ఇచ్చారు. అంగన్వాడీల అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలోను పెడతామన్నారు.

ఇక మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కుప్పం తెలుగుదేశం పార్టీ గడ్డ అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 5 ఏళ్లలో 35 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదన్నారు. కుప్పం నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా చేస్తానన్న చంద్రబాబు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తానన్నారు. అనంతరం మల్లానూరు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు కుప్పం 3 రోజుల పర్యటన ముగించారు. తర్వాత బెంగళూరుకు తిరుగు పయనం అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..