New year: మందు బాబులకు కిక్కిచ్చే న్యూస్.. డిసెంబర్ 31 రాత్రి..
ఈ నేపథ్యంలో మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు అర్థరాత్రి...

కొత్తేడాది వేడులకు అంతా సిద్ధమవుతున్నారు. రాత్రి 12 గంటలకు కొత్తేడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వేడుకులకు హోటల్స్, పబ్బులు, బార్లు సిద్ధమయ్యాయి. ఇక డిసెంబర్ 31 అంటేనే మందు బాబులకు పండగా. మందేస్తూ, చిందేస్తూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.
ఈ నేపథ్యంలో మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా వైన్స్ కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని చోట్ల 11 గంటల వరకు ఓపెన్ ఉండగా, న్యూ ఇయర్ నేపథ్యంలో గంటపాటు ఓపెన్ ఉంచుకునేలా అవకాశం కల్పించారు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను మరింత రెట్టింపు చేసేలా మరో శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్‌లో ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాటులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు వైన్స్ పనివేళలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
