AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Board Exams 2024: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించింది. జనవరి 3వ తేదీలోగా విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్‌ కోర్సుల్లో..

AP Inter Board Exams 2024: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
AP Inter Board
Srilakshmi C
|

Updated on: Dec 31, 2023 | 10:19 AM

Share

అమరావతి, డిసెంబర్‌ 31: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించింది. జనవరి 3వ తేదీలోగా విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్‌ కోర్సుల్లో 10,59,233 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోగా, ఇప్పటి దాకా 9,77,040 మంది ఫీజు చెల్లించారు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పేపర్ల మోడరైజేషన్‌ (సెట్టింగ్‌), పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తి కావడంతో ఇంటర్‌ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిలో మొదటి ఏడాది 5,29,015 మంది, రెండో ఏడాది 4,75,744 మంది విద్యార్థులున్నారు. వీరితో పాటు గతేడాది పలు సబ్జెక్టులలో ఫెయిలైన 1.48 లక్షల మంది విద్యార్ధుల్లో దాదాపు 90 వేల మందికి ‘రీ అడ్మిషన్‌’ ప్రభుత్వం కల్పించించింది. వీరిలో మరో 53 వేల మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. నామినల్‌ రోల్స్‌లో విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఇంటర్‌ బోర్డు కల్పించిన అవకాశం శనివారంతో ముగిసింది.

ఇప్పటి వరకూ తప్పులు సరిదిద్దకుండా నిర్లక్ష్యం వహించిన కాలేజీల ప్రిన్సిపల్స్‌ను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యపై స్పష్టత రావడంతో ఇంటర్‌ బోర్డు పరీక్షా కేంద్రాలపై దృష్టి పెట్టారు. గతంలో ప్రాంతీయ పరిశీలన అధికారులు (ఆర్‌ఐఓ) తమ రీజియన్‌ పరిధిలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు స్వయంగా పర్యవేక్షిస్తోంది. మొత్తం 1,489 జూనియర్‌ కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఎంపిక చేసింది. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తాగునీటి వనరులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.