Pawan Kalyan: నేడు అన్నవరం చేరుకోనున్న జనసేనాని .. కొండపై పార్టీ జెండాలు, రాజకీయ ప్రసంగాలు నిషేధం అన్న ఈవో ఆజాద్
పవన్ కళ్యాణ్ రాత్రి బస చేయనున్న పల్లవి గెస్ట్ హౌస్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం రేపు సాయంత్రం కత్తిపూడిలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం చేరుకోనున్నారు. రేపటి నుంచి జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు ఇక్కడ నుంచే అంకురార్పణ చేయనున్నారు. జనసేనాని రత్నగిరి కొండపై రాత్రి బస చేయనున్న దృష్టా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సత్యనారాయణ దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. రత్నగిరి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. పవన్ కళ్యాణ్ రాత్రి బస చేయనున్న పల్లవి గెస్ట్ హౌస్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం రేపు సాయంత్రం కత్తిపూడిలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జనసేన అధినేత, ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల తమ్మయ్యబాబు, ఇతర నేతలు చేస్తున్నారు. అన్నవరం కొండపై భక్తుల మనోభావాల దృష్ట్యా ఎలాంటి రాజకీయ సభలు, ప్రసంగాలు, పార్టీ జెండాలు తీసుకురావడం నిషేధమని, ఇందుకు సహకరించాలని ఈవో ఆజాద్ కోరారు.
అయితే మరోవైపు కోనసీమ జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న పవన్ వారాహి యాత్రకు పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తారు. పవన్ వారాహి యాత్ర.. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వివరాలు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జనసేన నేతలు పవన్ పర్యటన విషయంపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారాహి యాత్రకు అనుమతి ఇవ్వటానికి పోలీసులు లేవనెత్తిన అభ్యంతరాలపై కోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
