Pawan Kalyan: సీఎం జగన్ సొంత జిల్లా కడపలో నేడు జనసేనాని పర్యటన .. 175 మంది రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం
రాజంపేట నియోజవర్గం లోని సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నేడు పర్యటించనున్నారు. జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ను ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కడప విమానాశ్రాయానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా రాజంపేట నియోజవర్గం లోని సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ రచ్చబండలోనే బాధిత రైతు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాడ్డ 175మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఈ సాయాన్ని స్వయంగా అందించనున్నారు.
44 మంది రైతులు ప్రభుత్వ పరంగా సాయం లేక ఆత్మహత్య చేసుకున్నారని జనసేన పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎంతమంది ఏడు లక్షల పరిహారం ఇచ్చారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో అన్నదాతకు అండగా నిలబడుతున్నారని.. 5 కోట్ల సొంత నిధులతో ఈ సాయం ఇస్తున్నారని చెప్పారు. జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా బాధిత కుటుంబాలకు , అన్నదాతలకు నైతిక మద్దతు ఇవ్వనున్నారని తెలిపారు. కౌలు రైతుల ఆత్మహత్యల వివరాలను పోలీసు అధికారుల నుంచి సేకరించారని.. ఈ లిస్ట్ లో తప్పులుంటే చూపించాలని అధికార పార్టీ నేతలకు జనసేన నేతలు సవాల్ విసిరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..