Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి.. అదే ప్రాణాలు తీసిందా?
MLA Kapu Ramachandra Reddy: ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్
MLA Kapu Ramachandra Reddy: ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్ 101వ నంబరు ఫ్లాటులో ఆయన శవమై కనిపించారు. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం విగతజీవిగా కనిపించారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరిగింది. అయితే ఘటనా స్థలంలో పరిస్థితులు గమనిస్తుంటే ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. కాగా మంజునాథరెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో ఉంది. ఆయన సతీమణి స్రవంతి వైద్యురాలుగా విధులు నిర్వర్తిస్తోంది.
మా అబ్బాయి ఒత్తిడిలో ఉన్నాడు..
కాగా మంజునాథరెడ్డి మృతిపై సమాచారం అందిన వెంటనే విజయవాడకు బయలుదేరారు తండ్రి మహేశ్వరరెడ్డి. కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని… బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మంజునాథ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మొదట అందరూ భావించినప్పటికీ… అక్కడి పరిస్థితులు అలా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. 101 ఫ్లాటు బాధ్యతలు చూసే నరేంద్రరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌కు వచ్చి.. ఫ్లాట్లోకి వెళ్లారని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. మంజునాథ్ రెడ్డి పడిపోయారని చెప్పడంతో.. తామంతా వెళ్లి.. ఆయన్ను అంబులెన్స్‌లోకి ఎక్కించామని చెప్పారు. ఐతే ఆయన ఎప్పుడు చనిపోయారు? ఎలా మరణించారన్న దానిపై స్పష్టత లేదని వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..