Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. వారాహిలో మచిలీపట్నం బయలుదేరిన జనసేనానీ.. కళ్లు చెదిరేలా ర్యాలీ..

వారాహి కదిలింది. వడివడిగా మచిలీపట్నం వైపు సాగుతోంది! ఆటోనగర్‌ నుంచి ర్యాలీగా బయల్దేరారు పవన్ కల్యాణ్. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు.

Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. వారాహిలో మచిలీపట్నం బయలుదేరిన జనసేనానీ.. కళ్లు చెదిరేలా ర్యాలీ..
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2023 | 4:21 PM

వారాహి కదిలింది. వడివడిగా మచిలీపట్నం వైపు సాగుతోంది! ఆటోనగర్‌ నుంచి ర్యాలీగా బయల్దేరారు పవన్ కల్యాణ్. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆటోనగర్‌, తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు – గుడివాడ సెంటర్, గూడూరు మీదుగా మచిలీపట్నం సభాప్రాంగణానికి చేరుకుంటారు పవన్‌. మొదట ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

Janasena1

Janasena1

అయితే ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ముందే చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉందని SP జాషువా స్పష్టం చేశారు. విజయవాడ- మచిలీపట్టణం జాతీయ రహదారిపై ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు.కానీ పవన్ మాత్రం భారీ ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

Janasena2

Janasena2

జనసేన పదో ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు పుణ్యవేదికగా నామకరణం చేశారు. బందరు శివారులోని 35 ఎకరాల్లో సభ జరుగుతోంది. 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు..LED స్క్రీన్స్‌తో 10 గ్యాలరీలు పెట్టారు.

ఇవి కూడా చదవండి
Janasena

Janasena

10వ ఆవిర్భావ సభ.. పైగా ఎన్నికల ఏడాది.. అందులోనూ బందురు గడ్డపై జరుగుతున్న సమావేశం కావడంతో పవన్ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..