Andhra Pradesh: ఆ మహిళా మంత్రులపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారా.? ఇంతకీ వారు ఏం చేశారు.?

ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచిన తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ కేబినెట్ లోని మహిళా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాస్త గుర్రుగా ఉన్నారని పార్టీలో టాక్. పవన్ కళ్యాణ్ ని కౌంటర్ చేయడంలో మహిళా మంత్రులు నుంచి స్పందన కరువవ్వడం చూసి...

Andhra Pradesh: ఆ మహిళా మంత్రులపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారా.? ఇంతకీ వారు ఏం చేశారు.?
Cm Jagan
Follow us
S Haseena

| Edited By: Narender Vaitla

Updated on: Jul 15, 2023 | 1:20 PM

ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచిన తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ కేబినెట్ లోని మహిళా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాస్త గుర్రుగా ఉన్నారని పార్టీలో టాక్. పవన్ కళ్యాణ్ ని కౌంటర్ చేయడంలో మహిళా మంత్రులు నుంచి స్పందన కరువవ్వడం చూసి పార్టీ అగ్రనేతలే ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా పవన్ కళ్యాణ్ ఏపీలోని గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల్లో ఏపీలో మహిళల రక్షణపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలోని వాలంటీర్లు మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. 18 వేల మంది మహిళలు ను తరలించారని విమర్శించారు.

అంతేకాదు సీఎం జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తన తల్లి, భార్య, పిల్లల్ని అవమానిస్తున్నారని, వైఎస్ భారతి పేరు ప్రస్తావించి మరీ పవన్ విమర్శించారు. అంతేకాదు సీఎం జగన్ రేపిస్ట్ లను తయారు చేస్తున్నారు. మహిళలను రాజకీయాల్లోకి రానివ్వడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు జగన్ పై పవన్ చేసినా సీఎం జగన్ కేబినెట్ లోని మంత్రుల నుంచి అంతే స్థాయిలో ఎదురుదాడి రాకపోవడం పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి రోజా ఒక్కరే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని, వాలంటీర్లను, మహిళల అక్రమ రవాణా అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్‌కు అంతే స్థాయిలో రోజా కౌంటర్ ఇచ్చారు. సహజంగానే ఎప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా  ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఆర్కే రోజా వరుసగా ప్రతీ రోజు మంత్రి రోజా పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తన శాఖకు సంబంధం లేకపోయినా మంత్రి రోజా స్పందించారు. రోజాతో పాటు పార్టీకి చెందిన మహిళా అధ్యక్షులు పోతుల సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ వరుదు కళ్యాణి , మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మహిళా ఎమ్మెల్యేలంతా వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

సీఎం జగన్ కేబినెట్ లోని మహిళా మంత్రుల్లో మంత్రి రోజా ను మినహాయిస్తే మరో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. వారు హోంమంత్రి తానేటి వనిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అంత వ్యక్తిగతంగా పవన్ టార్గెట్ చేసినా, రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందన్నటువంటి తీవ్రమైన విమర్శ చేసినా ఈ ముగ్గురు మహిళా మంత్రులు ఒక్కటంటే ఒక్కరు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ చేయకపోవడం ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని మహిళా వాలంటీర్లు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ, పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా బాధ్యతగల మహిళా మంత్రులు స్పందించకపోవడం పట్ల పార్టీలోని సీనియర్లు సైతం ఆక్షేపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్రమ రవాణాకి సంబంధించి హోంమంత్రి తానేటి వనిత ఎటువంటి కౌంటర్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వలేదు. రాష్ట్రంలో మహిళల భద్రత అంశాలపై ప్రభుత్ వెర్షన్‌ని చెప్పలేకపోయారు. అలానే మంత్రి విడదల రజని కూడా ఈ అంశంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆమె జిల్లాల్లో పర్యటిస్తున్నారు, కేబినెట్‌కి హాజరయ్యారు, డెహ్రడూన్‌లో తన శాఖకు సంబంధించిన పర్యటనకు వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ పై కౌంటర్ మాత్రం ఇవ్వలేదు. మరో మంత్రి ఉషా శ్రీ చరణ్ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. అందుకు ఆమె కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. మహిళా మంత్రులకు ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నా సరే…కనీసం వాళ్ల ఇంట్లో ఉండి…ఒక వీడియో ద్వారానో, ఫేస్‌బుక్‌ ద్వారానో..ట్విట్టర్ ద్వారానో… అయినా పవన్ కి కౌంటర్ ఇవ్వలేరా ..? అని పార్టీలోని నాయకులే కాదు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ చాలా నిశితంగా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు, మీడియా చేసే ప్రతీ చిన్న ఆరోపణకి కూడా అధికారులు, పార్టీ నేతలు, మంత్రులు, సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వాలన్న స్పష్టమైన ఆదేశాన్నిచ్చారు. ఇందుకోసం ఆ వ్యవస్థల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. సోషల్ మీడియా వింగ్‌ని బలోపేతం చేశారు. దీనికి తోడు పీకే టీమ్ మానిటరింగ్ నిరంతరం ఉంటోంది. ఈ నేపథ్యంలో మహిళా మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏలూరు సమావేశంలో మహిళల అంశాలపై విమర్శలు చేసినప్పుడు పార్టీ లైన్ అందరికీ పంపారు. కొందరు కీలక నేతలు మహిళా మంత్రులకు ఫోన్ చేసి కౌంటర్ ఇవ్వాలని కూడా సూచించారు. అయినా సరే ఈ మహిళా మంత్రులు స్పందించకపోవడం పట్ల పార్టీలోని సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నారని చర్చ నడుస్తోంది. కొన్నాళ్ల కిందట సీఎం వైఎస్ జగన్ తన భార్య ను దూషిస్తున్నందుకు చాలా ఆవేదన చెందారు. కేబినెట్ లో మంత్రివర్గ సహచరుల వద్ద రాజకీయాలకోసం దారుణంగా నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తిత్వం, సంస్కారం, ఆయన భార్య ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేస్తున్నా స్పందించని వారి పట్ల పార్టీలో నెగటివ్ చర్చ సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!