Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న తర్వాత కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా మొదటగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. నంద్యాల జిల్లాకు వస్తున్న ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మోదీ పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మరోవైపు ప్రధాని ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో.. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




