Tungabhadra inflow: తుళ్లి పడుతున్న తుంగభద్రమ్మ.. డ్యామ్‌లోకి భారీగా వరద నీరు
తుంగభద్రమ్మ తుళ్లి పడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు, ఉప్పొంగి దూసుకొచ్చిన వరదలకు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. ఏకంగా 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు..
తుంగభద్రమ్మ తుళ్లి పడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు, ఉప్పొంగి దూసుకొచ్చిన వరదలకు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. ఏకంగా 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లోకి ఏకంగా 1.7 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంతే మొత్తాన్న దిగువకు వదులుతున్నారు అధికారులు. నీటి విడుదల జరగనున్న నేపథ్యంలో నదీ పరీవాక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు.
డ్యామ్‌లోకి ఎంత నీరు వస్తోందో చెప్పడానికి ఉదాహరణ ఇక్కడ ప్రళయంలా కనిపిస్తున్న నీటి వరద. తుంగభద్రకు ఎగువన ఉన్న తుంగ రిజర్వాయర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు విడుదల చేయడంతో పోటెత్తుతున్న వరద ఇది. ప్రళయాన్ని తలపించే ఈ ఫ్లో అంతా.. తుంగభద్ర డ్యామ్‌లోకి చేరుతుంది. దీంతో 100 టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్ నిండు కండలా మారిపోయింది.
తుంగభద్ర గేట్లు ఎత్తడంతో శ్రీశైలం వైపు వరద పరుగులు తీస్తోంది. మరోవైపు జూరాల నుంచి శ్రీశైలానికి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ఈ సీజన్‌లోనే అత్యధిక ఇన్ ఫ్లో నమోదు అవుతోంది.