AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Telangana Ration Card: రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది.రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి...

New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
Telangana Ration Card
Sanjay Kasula
|

Updated on: Jul 25, 2021 | 8:29 AM

Share

రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది.రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయానున్నారు. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు. నిజానికి జూన్ నెలలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు.

డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు. వారు వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు.

ఇవి కూడా చవండి: Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; నిరాశ పరిచిన మనూ బాకర్, యషస్విని దేస్వాల్