Eluru Municipal Corporation Election Results: ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీదే.. 30 స్థానాలు కైవసం.. మరికొన్ని స్థానాల్లో..
Eluru Municipal Corporation Election Results 2021: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్‌లో ముందు నుంచి
Eluru Municipal Corporation Election Results 2021: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్‌లో ముందు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ముందంజలో దూసుకుపోయారు. ఇప్పటివరకూ 30 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. మరో 8 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీడీపీ 2 డివిజన్లల్లో విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు గాను 3 ఏకగ్రీవం అయ్యాయి. ఈ 3 ఏకగ్రీవ డివిజన్లు ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. అయితే.. పూర్తి మెజారిటీ వైఎస్‌ఆర్‌సీపీకే ఉంది. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో కార్పొరేషన్‌ను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.
కాగా.. ధర్మాసనం ఆదేశాలతో ఈ రోజు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ 47 స్థానాల్లో పోటీచేయగా.. టీడీపీ 43 స్థానాల్లో, 20 చోట్ల జనసేన, ఇతర అభ్యర్థులు కలిపి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Also Read: