Robbery: మద్యం షాపుల్లో చోరీ.. ఆ షాపులే టార్గెట్‌గా దోపిడీ.. వారి పనేనా అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలు..

Robbery: కృష్ణా జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ వైన్ షాపుల్లో చోరీ జరిగింది. నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో తాళాలు..

Robbery: మద్యం షాపుల్లో చోరీ.. ఆ షాపులే టార్గెట్‌గా దోపిడీ.. వారి పనేనా అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలు..
Wine Shops
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2021 | 1:20 PM

Robbery: కృష్ణా జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ వైన్ షాపుల్లో చోరీ జరిగింది. నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు.. వాచ్‌మెన్‌పై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామలోని చందాపురం రోడ్డులోని మద్యం షాపు, నందిగామ జాతీయ రహదారిపై ఉన్న మద్యం షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే, షాపుల్లోని కౌంటర్లలో పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో కౌంటర్‌లో ఉన్న రూ. 1,500 తీసుకుని ఉండాయించారు.

కాగా, ఒక షాపు వద్ద వాచ్‌మెన్‌పై దాడి చేసిన దుండగులు.. మరో షాపు వద్ద వాచ్‌మెన్ ఉన్నా చోరీ జరుగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీకి గురైన వైన్ షాపులను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనేనా? లేక దొంగలకు సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు జరుపుతున్నారు. వాచ్‌మెన్‌ను విచారించడంతో పాటు.. వైన్ షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also read:

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; టెన్నిస్‌ డబుల్స్‌లో సానియాజోడీ ఓటమి

Araku Valley: వాళ్లు మేక వన్నె పులులు.. ‘ఆంధ్రా ఊటీ’ అరకులో నయా స్మగ్లింగ్ యాంగిల్

IND Vs SL, 1st T20 Preview: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా.. మిస్టరీ స్పిన్నర్‌కు అవకాశం? ఆత్మవిశ్వాసంతో శ్రీలంక.. నేటినుంచే టీ20 పోరు