AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku Valley: వాళ్లు మేక వన్నె పులులు.. ‘ఆంధ్రా ఊటీ’ అరకులో నయా స్మగ్లింగ్ యాంగిల్

విశాఖ జిల్లా- అరకుకు ఆంధ్రా ఊటీగా పేరు. ఎత్తైన కొండలూ కోనలూ లోయలూ జలపాతాలతో ఇక్కడి ప్రకృతి శోభ వర్ణనాతీతంగా ఉంటుంది. అన్ని సీజన్లలోనూ...

Araku Valley: వాళ్లు మేక వన్నె పులులు.. 'ఆంధ్రా ఊటీ' అరకులో నయా స్మగ్లింగ్ యాంగిల్
Araku Ganja Smuggling
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2021 | 1:07 PM

Share

విశాఖ జిల్లా- అరకుకు ఆంధ్రా ఊటీగా పేరు. ఎత్తైన కొండలూ కోనలూ లోయలూ జలపాతాలతో ఇక్కడి ప్రకృతి శోభ వర్ణనాతీతంగా ఉంటుంది. అన్ని సీజన్లలోనూ పర్యాటకులు క్యూ కడుతుంటారు. వింటర్, రెయినీ సీజన్లలో టూరిస్టుల సంఖ్య మరీ ఎక్కువ. మొన్నటి వరకూ కోవిడ్ కారణంగా అరకులో పర్యాటకుల తాకిడి పెద్దగా కనిపించలేదు. అధికారుల ఆంక్షలతో అరకు వైపు కనీసం కన్నెత్తి చూడ లేదు. ఇటీవల ఆంక్షల సడలింపుతో.. ఇప్పుడిప్పుడే టూరిస్టు సందడి కనిపిస్తోంది. ఇక్కడి వరకూ స్టోరీ కోవిడ్ వర్సెస్ టూరిస్ట్ గా సాగినా.. ఇందులోకి స్మగ్లింగ్ యాంగిల్ ఎంట్రీ ఇవ్వడంతో షాకవుతున్నారు పోలీసులు. టూరిస్టుల రూపంలో గంజాయి దందాకు తెరలేపుతున్నారు కొందరు స్మగ్లర్లు. పర్యాటకుల్లా వచ్చి అరకులో తిష్ట వేసి తమ కార్యకలాపాలకు యత్నిస్తున్నట్టు సమాచారం. హోటళ్లు లాడ్జీల్లో బస చేసి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలింపు కార్యక్రమాలకు స్కెచ్చేస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు.

అరకులో టూరిస్టుల రూపంలో వాలిపోతున్న స్మగ్లర్లపై నిఘా పెట్టాయి పోలీసు వర్గాలు. దీంతో అప్పుడప్పుడూ వీరి చేత స్మగ్లర్లు చిక్కడం కనిపిస్తోంది. నెల రోజుల్లో పదిహేను కేసుల వరకూ పట్టుకున్నారు పోలీసులు. కొందరు వాహనాల్లో యధేచ్చగా గంజాయి తరలిస్తుంటే.. మరికొందరు ఆర్టీసీ బస్సులను కూడా స్మగ్లింగ్ కు అనువుగా వాడేస్తున్నట్టు గుర్తించారు. బస్సు రాగానే బ్యాగులు ఎక్కించడం. తర్వాత ఏమీ ఎరగనట్టు ఉండిపోవడం చేస్తున్నారట. చెకింగ్ లో భాగంగా ఈ బ్యాగులను తెరిచి చూస్తే.. ఒక్కోసారి గంజాయి బయట పడుతోందట.

ఢిల్లీ, హర్యానాతో పాటు తమిళనాడు, కేరళ, హైదరాబాద్ నుంచి ఈ స్మగ్లర్లు వస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు. వీరిలో విద్యార్ధులు సైతం ఉండటం గమనార్హం. ఇలాంటి అనుమానాస్పద టూరిస్టులను గుర్తించడానికే ప్రత్యేక కసరత్తు మొదలు పెట్టామంటున్నారు పోలీసులు. ఇక వచ్చే రోజుల్లో ఇలాంటి ఆగడాలకు చెక్ పెడుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.

Also Read:నిర్మాత బన్నీ వాసు ఆవేదన.. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ

 ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి