AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder News: ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

బిహార్​ ముజఫర్​పుర్​ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది.  ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు...

Murder News:  ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య
Love Murder
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2021 | 12:11 PM

Share

బిహార్​ ముజఫర్​పుర్​ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది.  ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి….

ముజఫర్​పుర్​ జిల్లా.. రామ్​పురుశాహ్​ ఏరియాకి చెందిన సౌరభ్​రాజ్(22)​.. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారు సన్నిహితంగా మెలగడం ఓర్వలేక శనివారం దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్​ను తమ ఇంటి వద్దకు పిలిపించారు. అనంతరం.. అతడ్ని గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. సౌరభ్​ మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్​ను ఓ ఆస్పత్రిలో చేర్చి ఎస్కేప్ అయ్యారు. అయితే.. అక్కడే అతడు మృతి చెందాడు. సౌరభ్​ చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అతని గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. సౌరభ్​ డెడ్‌బాడీని తీసుకుని వచ్చి నిందితుడి ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. మృతదేహాన్ని ఆ ఇంటివద్దే దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్​ సంస్థలో సౌరభ్​ రాజ్​ పని చేస్తుంటాడని సమాచారం. తన సోదరి వివాహం ఉన్నందున జులై 1నే అతడు సెలవులపై ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:  పోలీసుల వినూత్న ప్రయత్నం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారో ఇకపై ‘రంగు’ పడుద్ది..

రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్