Lift Collapse: పనులు చేస్తుండగా కూలిన లిఫ్ట్.. ఐదుగురు దుర్మరణం..
Lift Collapses: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం చోటుచేసుకుంది. వర్లీ ప్రాంతంలోని హనుమాన్ గల్లిలో నిర్మాణంలోని ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ నేలకూలి ఐదుగురు ప్రాణాలు
Lift Collapses: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం చోటుచేసుకుంది. వర్లీ ప్రాంతంలోని హనుమాన్ గల్లిలో నిర్మాణంలోని ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ నేలకూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొదట నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. హనుమాన్ గల్లీలోని అంబికా బిల్డర్స్ సైట్‌లో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అంబికా బిల్డర్స్‌కు చెందిన ఓ భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కార్మికులందరూ యథావిధిగా పనులకు హాజరయ్యారు.
పనులు జరుగుతుండగానే సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ లిఫ్ట్ వేగంగా నేలకూలింది. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనలతో పరుగులు తీసినట్లు కార్మికులు తెలిపారు. అయితే ఋ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో మరణించిన వారిని అవినాష్ దాస్ (35), లక్ష్మణ్ మండల్ (35), భరత్ మండల్ (28), చిన్మయ్ మండల్ (33) గా గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొంటున్నారు.
Also Read: