Cyber Crime: ఇంతకంటే దారుణం మరోటుండదు.. తల్లి కోసం దాచిన డబ్బు.. ఒక్క ఫోన్ కాల్‌తో..

Cyber criminals fraud from woman: రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఓ గృహణి అక్షరాల 8లక్షల సొమ్మును సమర్పించుకుంది. ఈ షాకింగ్ సంఘటన హైదరాబాద్

Cyber Crime: ఇంతకంటే దారుణం మరోటుండదు.. తల్లి కోసం దాచిన డబ్బు.. ఒక్క ఫోన్ కాల్‌తో..
cyber crime
Follow us

|

Updated on: Jul 25, 2021 | 11:17 AM

Cyber criminals fraud from woman: రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఓ గృహణి అక్షరాల 8లక్షల సొమ్మును సమర్పించుకుంది. ఈ షాకింగ్ సంఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తల్లి క్యాన్సర్‌తో పోరాడుతుండగా.. ఆమెకు వైద్యం చేయించాలని కుమార్తె అనుకుంది. ఈలోగా ఓ ఫోన్‌ కాల్ వచ్చింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో మీరు విజేతగా నిలిచారంటూ ఫోన్ వచ్చింది. రూ.25 లక్షలు గెలుచుకున్నారంటూ ఆ ఫోన్లో చెప్పడంతో.. తల్లికి వైద్యం చేయిద్దామని మహిళ అనుకుంది. వల విసిరింది సైబర్‌ నేరగాళ్లని తెలుసుకోలేక రూ.8 లక్షలు సమర్పించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ గణేష్‌నగర్‌కు చెందిన సూరిశెట్టి గాయత్రీదేవి (36) కి ఈనెల 9న విజయ్‌ కుమార్‌ అనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘కౌన్‌ బనే గా కరోడ్‌పతి’లో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారని చెప్పాడు. అనంతరం బ్యాంకు అకౌంట్ నంబరు చెప్పమని చెప్పాడంతో ఆమె స్నేహితురాలి ఖాతా నంబరు ఇచ్చింది. తిరిగి ఫోన్‌ చేసిన విజయ్‌ కుమార్‌ ముందుగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలని మహిళతో పేర్కొన్నాడు. ఇది నమ్మిన ఆ మహిళ వెంటనే మీ సేవ కేంద్రం ద్వారా వారిచ్చిన బ్యాంక్‌ ఖాతాలో రూ.2 లక్షలు జమ చేసింది.

మళ్లీ ఈ నెల 15న సునీల్‌ మెహతా అనే వ్యక్తి సదరు మహిళకు ఫోన్‌ చేసి ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ ప్రోగ్రామ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ను అంటూ పరిచయం చేసుకున్నాడు. డబ్బును మీ అకౌంట్‌లోకి పంపాలంటే ముందు రూ.75 వేలు చెల్లించాలని చెప్పాడు. అనంతరం, గృహిణి వారి ఖాతాకు రూ.75 వేలు పంపించింది. ఇదే అదనుగా భావించిన సంబంధిత వ్యక్తి ఈ నెల 17న మహిళకు ఫోన్‌ చేసి మీరిచ్చిన అకౌంట్‌లో రూ.25 లక్షలు జమ చేశాము. కానీ అమౌంట్‌ ఫ్రీజ్‌ అయింది. ఈ డబ్బు మీకు చేరాలంటే.. రూ.లక్షా 25 వేలు పంపాలని కోరారు. దీనికి అంగీకరించిన మహిళ వారు చెప్పినట్లుగానే గూగుల్‌ పే, ఫోన్‌ పే నుంచి డబ్బు పంపించింది. ఇదే విధంగా సదరు మహిళను ట్రాప్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు పలు దఫాలుగా మరో రూ.4 లక్షల 18వేలు పలు మార్లు తీసుకున్నారు.

ఇలా 13 రోజుల వ్యవధిలో ఆమె నుంచి మొత్తం రూ.8 లక్షల 18వేలు కాజేశారని పోలీసులు వెల్లడించారు. ఇలా సైబర్ నేరగాళ్లు మహిళ నుంచి డబ్బు దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెకు వచ్చిన ఫోన్ నెంబర్ల సహాయంతో ఇన్విస్టిగేషన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Ayodhya: అయోధ్యలోని హనుమాన్‌ఘర్ ఆలయంలో బాంబు కలకలం.. అసలు మ్యాటర్ తెలిసి షాక్ అయిన అధికారులు..

Kulgam Encounter: కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. కొనసాగుతున్న సెర్చింగ్ ఆపరేషన్..