Ayodhya: అయోధ్యలోని హనుమాన్‌ఘర్ ఆలయంలో బాంబు కలకలం.. అసలు మ్యాటర్ తెలిసి షాక్ అయిన అధికారులు..

Ayodhya: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అయోధ్య జిల్లాలలోని హనుమాన్‌ఘర్ ఆలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ ఫోన్‌ కాల్ అధికారులను కంటిమీద కునుకు..

Ayodhya: అయోధ్యలోని హనుమాన్‌ఘర్ ఆలయంలో బాంబు కలకలం.. అసలు మ్యాటర్ తెలిసి షాక్ అయిన అధికారులు..
Bomb In Temple
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2021 | 9:48 AM

Ayodhya: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అయోధ్య జిల్లాలలోని హనుమాన్‌ఘర్ ఆలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ ఫోన్‌ కాల్ అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. లేని బాంబ్ కోసం అధికారులు తీవ్రంగా గాలించారు. చివరికి విషయం తెలిసి షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ఫైజాబాద్ నగర శివార్లలోని సాదత్ గంజ్ ప్రాంతంలో హనుమాన్ ఆలయం ఉంది. అయితే, రాత్రి 9 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 112 కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. హనుమాన్‌ఘర్ ఆలయంలోని బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అలర్ట్ అయిన స్థానిక పోలీసులు రాత్రి ఆలయం ప్రాంగాణానికి చేరుకున్నారు. ఆలయంలో ఉన్న అందరినీ బయటకు పంపించారు.

బాంబ్ స్క్వాడ్ సాయంతో ఆలయం మొత్తం గాలింపు చేపట్టారు. చివరికి ఏమీ దొరకలేదని అయోధ్య సూపరింటెండెంట్ శైలేష్ పాండే ప్రకటించారు. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పోలీసులకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. ఫైజాబాద్‌ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడని, తాగిన మైకంలో అతను ఈ సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు. అనిల్ కుమార్ కూడా తన తప్పును అంగీకరించినట్లు ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Director Sukumar: సుకుమార్‌కు స్వల్ప అస్వస్థత.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్‌..?

ఓరి దేవుడో…వ్యాక్సిన్‌ కోసం..జుట్టు ఉడేలా కొట్టుకున్న మహిళలు..వైరల్ అవుతున్న వీడియో..:Women fight for vaccine Video.

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..