Director Sukumar: సుకుమార్‌కు స్వల్ప అస్వస్థత.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్..?
Pushpa Director Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సుకుమార్ క్రియేటవిటికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. హిట్ ఫ్లాఫ్‌లతో
Pushpa Director Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సుకుమార్ క్రియేటవిటికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. హిట్ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తాయి. మూడేళ్ల కిందట సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా మొత్తం సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇప్పుడు అదే రేంజ్‌లో సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది చివర్లో, రెండో పార్ట్ వచ్చే ఏడాది విడుదలచేసేందకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. మొదటి నుంచి మెడిసిన్స్, ఇంజక్షన్లకు దూరం ఉండే సుకుమార్.. జ్వరం ఉండటంతో హోమియోపతి ఔషధాలను తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. సుకుమార్ ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్‌కు విరామం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటారని.. ఆ తర్వాత పుష్ప సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: