Taimur Viral Video: తైమూర్‌కు అప్పుడే సెలబ్రిటీల లక్షణాలు వచ్చేశాయ్‌గా.. వైరల్ అవుతోన్న పటౌడీ ప్రిన్స్ హావభావాలు..
Taimur Viral Video: బాలీవుడ్ మోస్ట్ సెలబ్రిటీ జంటల్లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ ఒకరని చెప్పడంలో ఎలాంటి అతియోక్తి లేదు. ఈ జంట ఎక్కడ కనిపించినా మీడియా ఎగబడుతుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి...
Taimur Viral Video: బాలీవుడ్ మోస్ట్ సెలబ్రిటీ జంటల్లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ ఒకరని చెప్పడంలో ఎలాంటి అతియోక్తి లేదు. ఈ జంట ఎక్కడ కనిపించినా మీడియా ఎగబడుతుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సెలబ్రిటీ హోదానే వీరి కుమారుడు తైమూర్ కూడా పొందాడు. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియోనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. కరీనా-సైఫ్ ముద్దుల కుమారుడు తైమూర్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ చిన్నోడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా తైమూర్ తండ్రి సైఫ్ అలీఖాన్‌తో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న మీడియా ఒక్కసారిగా తైమూర్‌ను ఫొటోలు తీసేందుకు ఎగబడింది. అయితే సైఫ్ కారు దిగి వెంటనే వేగంగా గేట్‌లోపలికి వెళ్లిపోయాడు. కానీ తైమూర్ మాత్రం పెద్ద హీరో ఇచ్చినట్లు ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశాడు. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రకరకాల హావభావాలతో ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ సందడి చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన వారు అప్పుడే ఈ చిన్నారికి సెలబ్రిటీల లక్షణాలు వచ్చాయని అంటున్నారు. మరి సైఫ్ తన కూమారుడిని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే సైఫ్-కరీనాకు జంటకు తైమూర్ 2016లో జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ కపుల్ మరో చిన్నారికి జన్మిచ్చారు. రెండో కుమారుడికి జెహ్ అనే పేరు పెట్టారీ కపుల్. ఇక సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆది పురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటిస్తోన్న సైఫ్ ఏ మేర ఆకట్టుకుంటారో చూడాలి.
వైరల్ మారిన తైమూర్ వీడియో..
View this post on Instagram
Also Read: Nandamuri Balakrishna: జోరుపెంచిన నటసింహం.. డైనమిక్ డైరెక్టర్‌తో మరో సినిమా ప్లాన్..
Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..
Mahesh Babu: నాలుగుపదుల వయసులోనూ నవయువకుడిగా.. మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్