Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..

జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు.

Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..
Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2021 | 7:35 PM

Ishq Not A Love Story: జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా జాంబీల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత తేజ సజ్జ నటిస్తున్న సినిమా ఇష్క్. ఈ సినిమాలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు యస్.యస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్లు, ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఆనందం మదికే .. అనేపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా లేటెస్ట్ సెన్షేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. ఈ పాట యువ హృదయాలను తాకుతుంది. అలాగే వీడియో కూడా చాలా కలర్ ఫుల్ గా ఫ్రెష్ ఫీలింగ్ తో సాగిపోయింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: నాలుగుపదుల వయసులోనూ నవయువకుడిగా.. మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్

Bajrangi Bhaijaan : ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాని రాజమౌళి నిరాకరించాడు..! కారణమేంటో చెప్పిన విజయేంద్ర ప్రసాద్

Megastar Chiranjeevi : వెంకీ నీకిది పర్ఫెక్ట్ సినిమా.. నారప్ప పై మెగాస్టార్ ప్రశంసలు