Mahesh Babu: నాలుగుపదుల వయసులోనూ నవయువకుడిగా.. మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ అందానికి ఫిదా కానీ అమ్మాయి ఉండదేమో..
Mahesh Babu: టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ అందానికి ఫిదా కానీ అమ్మాయి ఉండదేమో.. అందుకే అత్యధిక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాలుగు పదుల వయసులోనూ నవయువకుడిగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోన్నారు మహేష్. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారు సూపర్ స్టార్. ఇటీవల మహర్షిలో ఏకంగా కాలేజ్ బోయ్ గా కనిపించి ఆకట్టుకున్న మహేష్ భరత్ అనే నేను సినిమాలో స్టైలిష్ సీఎం గా కనిపించి సర్ఫరైజ్ చేశారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో కలిసి మహేష్ థమ్సప్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ యాడ్ షూట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నారు. ఖాళీ చేసిన థమ్సప్ బాటిల్‌ని చూపిస్తూ మహేష్ ఇచ్చిన ఫోజులు వైరల్‌గా మారాయి. మహేష్ అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ ఆయన తనయుడు గౌతమ్ కృష్ణకు అన్నయ్యాలా ఉన్నారంటూ..అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :