AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajrangi Bhaijaan : ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాని రాజమౌళి నిరాకరించాడు..! కారణమేంటో చెప్పిన విజయేంద్ర ప్రసాద్

Bajrangi Bhaijaan : బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ సినిమా 2015 లో విడుదలైంది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.

Bajrangi Bhaijaan : 'భజరంగీ భాయ్‌జాన్' సినిమాని రాజమౌళి నిరాకరించాడు..! కారణమేంటో చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Ss Rajamouli Salman Khan
uppula Raju
|

Updated on: Jul 24, 2021 | 6:11 PM

Share

Bajrangi Bhaijaan : బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ సినిమా 2015 లో విడుదలైంది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఇది ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాగా గుర్తింపు సాధించింది. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు. అయితే ఈ చిత్రాన్ని మొదట ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. తర్వాత తప్పుకొని కబీర్ ఖాన్‌కు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు.

కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 69,969 కోట్ల వ్యాపారం చేసింది. ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ రెండో అత్యధిక వ్యాపార చిత్రం. కబీర్ ఖాన్, అతని మొత్తం బృందం కలిసి ఈ సినిమాకి ప్రాణం పోశారు. ప్రారంభంలో విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర కథను ఎస్.ఎస్.రాజమౌళికి వివరించాడు. ఆ సమయంలో రాజమౌళి బాహుబలి చిత్రీకరణలో ఉన్నాడు. ఈ కారణంగా ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి నిరాకరించాడు. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కబీర్ ఖాన్‌తో మాట్లాడారు.

విజయేంద్ర ప్రసాద్ ఇటీవల టాలీవుడ్.నెట్‌తో మాట్లాడుతూ.. “నా కథను రాజమౌళికి వివరించాను కానీ ఆ సమయంలో అతడు బాహుబలి యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. అందువల్ల ఈ చిత్ర బాధ్యతలు వేరేవారికి అప్పగించాల్సి వచ్చిందని తెలిపాడు ” భజరంగీ భాయ్‌జాన్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు సల్మాన్ ఖాన్‌ను చాలా ఇష్టపడ్డారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రాన్ని తన జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావిస్తాడు. ఈ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా ఫీలవుతాడు.

Body Building : మీరు డైలీ జిమ్ చేస్తారా..! అయితే కచ్చితంగా ఈ తప్పులు తెలుసుకోండి..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Tesla Cars in India: టెస్లాను భారత్ తీసుకురావాలని ఉంది..కానీ, అదే అడ్డంకిగా మారింది అంటున్న ఎలాన్ మస్క్ 

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్