AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,820 శాంపిల్స్ టెస్ట్ చేయగా....
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,820 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,174 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1952513కు చేరింది. మరో 18 మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13241 కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,737 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1916914కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22358 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూర్ జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి…
#COVIDUpdates: 24/07/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,49,618 పాజిటివ్ కేసు లకు గాను *19,14,019 మంది డిశ్చార్జ్ కాగా *13,241 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,358#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/h0yeP4XSRQ
— ArogyaAndhra (@ArogyaAndhra) July 24, 2021
కరోన సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే: ● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Also Read: ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు…