AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss OTT: ఇకపై అరచేతిలో ఇంటి గుట్టు.. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న బిగ్‌బౌస్‌.. రోజంతా ప్రసారం..

Big Boss OTT: అమెరికాలో మొదలై అనకాపల్లి వరకు పాకింది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. కొంత మంది వ్యక్తులను ఓ గదిలో బంధించి వారు మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూపించడమే ఈ షో లక్ష్యం. అయితే వీరిలో ఉండేవారందరూ...

Big Boss OTT: ఇకపై అరచేతిలో ఇంటి గుట్టు.. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న బిగ్‌బౌస్‌.. రోజంతా ప్రసారం..
Bigboss Ott
Narender Vaitla
|

Updated on: Jul 25, 2021 | 5:43 AM

Share

Big Boss OTT: అమెరికాలో మొదలై అనకాపల్లి వరకు పాకింది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. కొంత మంది వ్యక్తులను ఓ గదిలో బంధించి వారు మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూపించడమే ఈ షో లక్ష్యం. అయితే వీరిలో ఉండేవారందరూ సెలబ్రిటీలు కావడంతో ప్రేక్షకుల్లోనూ బిగ్‌బాస్‌పై ఆసక్తి పెరిగింది. భారత్‌లో దాదాపు అన్ని భాషల్లో ఈ రియాలిటీ షో టెలికాస్ట్‌ అవుతోంది. ఇక భారత్‌లో మొదటగా హిందీలో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా 15వ సీజన్‌ ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఈసారి రియాలిటీ షోలో భారీగా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సల్మాన్‌ ఖాన్‌ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించగా తాజాగా కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

అంతేకాకుండా ఈసారి బిగ్‌బాస్‌ నిర్వాహకులు షోను ఓటీటీలో ప్రసారం చేయనుండడం మరో విశేషం. తొలి ఆరు వారాలకు కరణ్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షోను టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ వూట్‌లో టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఓటీటీలో బిగ్‌బాస్‌షో ఏకంగా 24 గంటలు ప్రసారం కానుంది. అంటే హౌజ్‌లో కంటిస్టెంట్స్‌ ఏం చేస్తున్నారో ప్రతీ క్షణం అరచేతిలోనే చూసేయొచ్చన్నమాట. ఆగస్టు 8నుంచి ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా సభ్యులకు ఇచ్చే టాస్క్‌లను కూడా ప్రేక్షకులే నిర్ణయించే అవకాశాన్ని తీసుకున్నారు. ఓటీటీలో కేవలం తొలి ఆరు వారాలను మాత్రమే టెలికాస్ట్‌ చేయనున్నారు. మిగతా షో టీవీలోనే ప్రసారమవుతుంది. ఇదిలా ఉంటే మరి తెలుగు బిగ్‌బాస్‌ కూడా ఓటీటీలో ప్రసారమవుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగులో బిగ్‌బాస్‌ ప్రసారమవుతోన్న స్టార్‌మాకు.. హాట్‌ స్టార్‌ పేరుతో ఓటీటీ ఉండనే ఉంది. మరి బాలీవుడ్‌ మాదిరిగానే తెలుగులోనూ కొంతమేర హాట్‌ స్టా్‌ర్‌లో టెలికాస్ట్‌ చేస్తారా.? చూడాలి.

Karna

Also Read: Nandamuri Balakrishna: జోరుపెంచిన నటసింహం.. డైనమిక్ డైరెక్టర్‌‌‌తో మరో సినిమా ప్లాన్..

Ishq: శ్రోతల హృదయాలను తాకుతున్న అందమైన ప్రేమ పాట.. ఇష్క్ నుంచి వీడియో సాంగ్..

Mahesh Babu: నాలుగుపదుల వయసులోనూ నవయువకుడిగా.. మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్