Tokyo Olympics 2021: మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో భారత ఆశలు గల్లంతు.. నిరాశపరిచిన మను బాకర్, దేస్వాల్

అర్హత రౌండ్‌లో మను భాకర్ 575 మార్కులు, యశస్విని దేస్వాల్ 574 పాయింట్లు సాధించారు. ఫైనల్‌ చేరుకోవడానికి అవసరమైన 577 పాయింట్లను చేరుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఈ 10మీ. ఎయిర్ ఫిస్టల్‌లో పతకం ఆశలు నీరుగారాయి.

Tokyo Olympics 2021: మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో భారత ఆశలు గల్లంతు.. నిరాశపరిచిన మను బాకర్, దేస్వాల్
manu bhakar
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2021 | 9:40 AM

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో సూపర్ సండే ప్రారంభం కూడా భారత్‌కు కలిసిరాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇద్దరు భారత షూటర్లు మను బాకర్, యషస్విని దేస్వాల్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. షూటర్‌లు ఇద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో లక్ష్యాన్ని చేరుకోలేక నిరాశపరిచారు. ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే టాప్ 8 కి చేరుకోవాల్స ఉంది. కానీ, మను 12 వ స్థానంలో, యషస్విని 13 వ స్థానంలో నిలిచారు. మను బాకర్ క్వాలిఫికేషన్‌లో అద్భుతంగా రాణిస్తాడని అనుకున్నారు. కానీ, మను పిస్టల్ ఆమెను మోసం చేసింది. కేవలం 2 పాయింట్ల తేడాతో ఫైనల్ బెర్త్‌కు దూరమయింది. యషస్విని కూడా 3 పాయింట్ల దూరంలో ఆగిపోయింది. మను బాకర్ అర్హత రౌండ్లో 575 మార్కులు సాధించి 12 వ స్థానంలో నిలిచింది. అలాగే యషస్విని దేస్వాల్ 574 పాయింట్లు సాధించి 13 వ స్థానంలో నిలిచింది. ఫైనల్‌లో అర్హత సాధించేందుకు కావాల్సిన 577 పాయింట్లు సాధించలేక చతికిలపడ్డారు.

భారత షూటర్ మను బాకర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఘనంగానే ప్రారంభించింది. దాంతో ఈజీగానే ఫైనల్ చేరుకుంటుంది అనుకున్నారంతా. కానీ, తన పిస్టల్‌లో సాంకేతిక లోపం రావడంతో, అనుకున్న సమయం కంటే 5 నిమిషాలు ఎక్కువగా తీసుకుంది. అనంతరం బరిలోకి దిగినా..ఒత్తిడి లోనై లక్ష్యానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో నిలిచిపోయింది. యషస్విని కూడా లక్ష్యం చేరడంలో తడబడింది. దీంతో మొదటి 8 స్థానాలు సాధించలేక ఫైనల్ అవకాశాలను కోల్పోయారు.

Also Read:

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; నిరాశ పరిచిన మనూ బాకర్, యషస్విని దేస్వాల్

Tokyo Olympics 2021: పీవీ సింధు శుభారంభం; 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన భారత బ్యాడ్మింటన్ స్టార్

Tokyo Olympics 2021: రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే