Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..

Chennai road accident: చెన్నై శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ యాషిక ఆనంద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. యాషిక ఫ్రెండ్‌ భవాని ప్రాణాలు..

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..
Bigg Boss Fame Yashika Anan
Follow us

|

Updated on: Jul 25, 2021 | 9:47 AM

చెన్నై శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ యాషిక ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. యాషిక ఫ్రెండ్‌ భవాని ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మహాబలిపురం నుండి చెన్నై వస్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా కారు నడిపి డివైడర్‌ని ఢీ కొట్టడమే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. కారు లో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం సేవించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

తమిళనాడు చెన్నైకి సమీపంలోని మామల్లపురం సెంటర్ మీడియన్‌ సమీపంలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యాషిక తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. ఇదిలావుంటే యాషిక స్నేహితురాలు భవాని స్పాట్‌లోనే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆమెను హైదరాబాద్‌కు చెందిన వల్లిచెట్టి భవానీ (28)గా గుర్తించారు స్థానిక పోలీసులు. మమల్లాపురం పోలీసులు వల్లిచెట్టి భవానీ (28) మృతదేహాన్ని స్వాధీనంచేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరితోపాటు మరో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి వివరాలు మాత్రం తెలియలేదు.

నటి యాషికా ఆనంద్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలోని ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా పలు రియాలిటీ షోల్లో కూడా పాల్గొని చాలా ఫేమ్ అయ్యారు. యాషికా ఆనంద్ ఢిల్లీలో పుట్టి… చెన్నైలో స్థిరపడ్డారు. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ నటి… 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌తో ఆరంగెట్రం చేశారు. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది.

2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Latest Articles