Viral Video: మెట్రో స్టేషన్‌లో కలకలం.. పైనుంచి దూకేందుకు యువతి యత్నం.. ప్రాణాలను తెగించి.. షాకింగ్ వీడియో

Cops Save Woman: మెట్రో స్టేషన్‌లో అప్పటివరకు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమైందో ఏమో కానీ ఓ యువతి మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు

Viral Video: మెట్రో స్టేషన్‌లో కలకలం.. పైనుంచి దూకేందుకు యువతి యత్నం.. ప్రాణాలను తెగించి.. షాకింగ్ వీడియో
Faridabad Cops Save Woman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2021 | 1:24 PM

Cops Save Woman: మెట్రో స్టేషన్‌లో అప్పటివరకు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమైందో ఏమో కానీ ఓ యువతి మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి చేరకున్నారు. వారిని చూసిన ఆ యువతి దూకేస్తానంటూ బెదిరించింది. ఈ క్రమంలో ఆమెను చిన్నగా మాటల్లోకి దించిన పోలీసులు.. ప్రాణాలకు తెగించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల తెగువను చూసి నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం, ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలోని ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్‌ సెక్టార్‌ 28 మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

ఫరీదాబాద్‌ సెక్టార్‌ 28 మెట్రో స్టేషన్‌లో శనివారం సాయంత్రం బాల్కనీ పైకి ఓ యువతి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే.. ఇంతలో సమాచారం అందుకున్న ఎస్సై ధన్‌ ప్రకాశ్‌ కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై చిన్నగా ఆ యువతిని మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలో కానిస్టేబుల్‌ సర్ఫ్‌రాజ్‌ స్టేషన్‌ బాల్కనీకి చేరుకొని రెప్పపాటులో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి కూడా బాల్కానీ గోడపైకి దిగి యువతిని పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరు ఆమెను పైకి చేర్చారు.

కాగా.. ఆ యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడితో ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. కాగా, ఈ వీడియోను ఫరీదాబాద్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రాణాలకు తెగించి పోలీసులు ఆ యువతిని కాపాడారంటూ తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా యువతిని కాపాడిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. ప్రాణాలకు తెగించి యువతిని కాపాడారంటూ ఫరిదాబాద్‌ పోలీసులను అభినందిస్తున్నారు.

Also Read:

Mom swim class: ఏడాది బుడ్డోడికి స్విమ్మింగ్ ట్రైనర్‌గా తల్లి.. నేర్పించే తీరు చూసి జనం షాక్..

Viral Video: స్టేజ్‌పైనే వరుడికి చెమటలు పట్టించిన వధువు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?