Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mom swim class: ఏడాది బుడ్డోడికి స్విమ్మింగ్ ట్రైనర్‌గా తల్లి.. నేర్పించే తీరు చూసి జనం షాక్..

దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ తల్లి తన బిడ్డకు ఈత నేర్పిస్తోంది. కానీ తల్లి తన బిడ్డకు ఈత నేర్పించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

Mom swim class: ఏడాది బుడ్డోడికి స్విమ్మింగ్ ట్రైనర్‌గా తల్లి.. నేర్పించే తీరు చూసి జనం షాక్..
Mother Giving Swimming Less
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 25, 2021 | 10:52 AM

చాలా మంది తల్లిదండ్రులు స్పోర్ట్స్ కోచ్‌గా మారుతుంటారు. తమ ఆశా జ్యోతులకు మార్గదర్శులుగా మారుతుంటారు. వారిని వెలుగు దివ్వెలుగా మార్చేందుకు వారి శక్తిని దారపోస్తుంటారు. తమ సంతానం ఎంతో ఎత్తుకు ఎదగాలని వారికి గురువుగా మారుతుంటారు. ప్రపంచంలోని ప్రతి తల్లిదండ్రులు ఇదే కోరకుంటారు. తమ బిడ్డలను ఇతర పిల్లలకన్నా తెలివిగా.. పూర్తిగా భిన్నంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సు నుండే అనేక రకాల్లో శిక్షణ ఇప్పిస్తుంటారు. తద్వారా వారు ప్రతి ఇక్కరి దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. వారి ప్రతిభను చూసి అంతా మెచ్చుకుంటుంటే మురిసిపోతుంటారు.

చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం .. పాటలు పాడటంలో శిక్షణ ఇప్పించడం.. క్రికెటర్‌గా మార్చేందుకు స్వయంగా బ్యాట్ పట్టించడం మనం ఇప్పటి వరకు చూశాం. అయితే ఓ తల్లి ఇందుకు భిన్నంగా తన కొడుకుకు తానే ట్రైనర్‌గా మారింది. బెస్ట్ స్విమ్మర్‌గా తీర్చి దిద్దందుకు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగింది. అయ్యే.. ఇందులో ఏం ప్రత్యేకత ఉందనుకుంటున్నారా.. ఇక్కడే అసలు సంగతి ఉంది. వాడి వయసు ఏ నాలుగో.. ఐదు సంవత్సరాలో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఈ వీడియోలోని బుడ్డోడి వయసు కేవలం కొన్ని నెలలు మాత్రమే.. ఆ తల్లి వీడికి అప్పటి నుంచే ఈతలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ తల్లి తన బిడ్డకు ఈత నేర్పిస్తోంది. కానీ తల్లి తన బిడ్డకు ఈత నేర్పించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by WEIRD Vidz (@weirdvidz)

ఇన్‌స్టాగ్రామ్‌లో విర్డ్ విడ్జ్ అనే ఖాతా ఈ వీడియో పోస్ట్ చేశారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో వింత వీడియోలు అప్‌లోడ్ అవుతాయి. ఈ  వీడియోలు చూసిన తరువాత.. నెటిజన్లు నివ్వెరపోతారు. ఈ ఖాతాలో స్విమ్మింగ్ పూల్ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు. ఇందులో ఒక తల్లి తన చిన్న బిడ్డకు ఈత నేర్పిస్తోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా చూశారు. కొంతమంది తల్లి యొక్క ఈ దశను తప్పుగా చెబుతున్నారు.

ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడిని ఈత కొలనుకు తీసుకెళ్లడం ఏంటో.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు తల్లి శైలి చాలా క్రూరంగా ఉందంటున్నారు. కానీ ఈ వీడియోలో కొంతమంది పిల్లల తల్లికి కూడా మద్దతు ఇస్తున్నారు. పిల్లలకు ఈత నేర్పడానికి ఇది ఉత్తమమైన వయస్సు అని.. పద్ధతి కూడా మంచిదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..