Andhra Pradesh: ఇద్దరు యువతుల రచ్చ.. ప్రేమ, పెళ్ళి, స్నేహం ఏది నిజం.. తలపట్టుకుంటున్న పోలీసులు..!
Andhra Pradesh: టిక్‌టాక్ వేదికగా మొదలైన ఇద్దరు యువతుల పరిచయం.. ప్రేమ, పెళ్ళి, స్నేహం అంటూ రచ్చకు దారి తీసింది. ఇద్దరు యువతులు సుమలత, రమ్య పెళ్ళి చేసుకున్నారంటూ..
Andhra Pradesh: టిక్‌టాక్ వేదికగా మొదలైన ఇద్దరు యువతుల పరిచయం.. ప్రేమ, పెళ్ళి, స్నేహం అంటూ రచ్చకు దారి తీసింది. ఇద్దరు యువతులు సుమలత, రమ్య పెళ్ళి చేసుకున్నారంటూ ఓ యువతి తల్లి అంటుండగా.. తమది ప్రేమ కాదు, కేవలం స్నేహం మాత్రమే అంటున్నారు సదరు యువతులు. ఈ మొత్తం పంచాయతీ పోలీసులకు చేరగా.. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పైగా ఇద్దరు యువతులూ మేజర్లే కావడంతో ఏం చేయాలో అర్థంకాక బుర్ర హీటెక్కి చేతులెత్తేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు యువతుల రచ్చ.. ఒంగోలులో ఇద్దరు మహిళల స్నేహం వివాదాస్పదంగా మారింది. టిక్‌టాక్ వేదికగా ఇద్దరు యువతులు సుమలత, రమ్య ప్రేమ, పెళ్ళి వంటి అంశాలపై వీడియోలు చేయడంతో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తాము పెళ్ళి చేసుకోలేదని, కేవలం టిక్‌టాక్‌లో ఫేమస్ కావడం కోసం నాటకీయంగా వీడియోలు చేశామంటున్నారు. ఆ వీడియోలను చూసి రమ్య తల్లి తమకు లేనిపోని సంబంధాలు అంటగట్టి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని సుమలత ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో రమ్య తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇద్దరు యువతులు సహజీవనం చేసే విషయంలో ఎలాంటి నేరప్రవృత్తి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయం కాబట్టి ఇక్కడ నేరం జరిగినట్టు కాదని పోలీసులు చేతులెత్తేశారు. అయితే తాము పెళ్ళి చేసుకోలేదని, కేవలం కలిసి ఉంటున్నామని ఆ ఇద్దరు యువతులు చెప్పడం విశేషం. ఇద్దరు యువతుల మధ్య స్నేహం వివాదం కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఒంగోలులో చర్చనీయాశంగా మారింది.
వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. ఒంగోలులో ఇద్దరు యువతులు సుమలత, రమ్య ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. అయితే, రమ్య డిగ్రీ చదువుతోంది. సుమలత ఓ డెయిరీ దుకాణంలో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరికీ గతంలోనే పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్తా టిక్‌టాక్ వేదికగా మరింత దగ్గరయ్యేలా చేసింది. దీంతో ఇద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నట్టు, పెళ్ళి కూడా చేసుకున్నట్టు వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పెట్టారు. వీరి వీడియోలకు లైక్‌లు ఎక్కువగా వస్తున్నాయన్న కారణంగా మరింత దూకుడు పెంచారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా రచ్చగా మారింది.
రమ్య తల్లి ఎంట్రీతో వివాదం.. గతంలో తల్లితో కలిసి ఉంటున్న రమ్య ఇంటికి రాకపోవడం, సుమలతతో కలిసి మరో ఇంట్లో ఉండటంతో అనుమానం వచ్చిన రమ్య తల్లి వీరిద్దరి ప్రవర్తనపై ఆరా తీసింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందని నిలదీసింది. అయితే తామిద్దరం కలిసి ఉంటామని, ఇంటికి రానని తల్లి నాగమణికి రమ్య తెగేసి చెప్పడంతో తన కూతుర్ని నీ దగ్గర ఉంచాలంటే పది లక్షలు ఇవ్వాలని సుమతలను రమ్య తల్లి నాగమణి డిమాండ్ చేసింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. పోలీసుల దగ్గర పంచాయతీ పెట్టారు. అయితే వీరిద్దరిని విచారించిన పోలీసులు ఇక్కడ నేరం జరిగినట్టు ఎలా భావించాలో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. ఇద్దరు యువతులు మేజర్లు కావడంతో వారు కలిసి బతకాలా, లేక విడిగా ఉండాలన్నది వారి వ్యక్తిగత వ్యవహారంగా తేల్చారు. ఈ వ్యవహారాన్ని బయటే తేల్చుకోవాలంటూ పంపించేశారు. ఇద్దరు యువతుల వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో ఈ విషయంపై ఒంగోలు నగరంలో చర్చ మొదలైంది.
రమ్య విద్యార్దిని.. మరి సుమలత..? 2019 నవంబర్ 7న ఒంగోలులో ఓ సంఘటన జరిగింది. సాయితేజారెడ్డి పేరుతో మగగొంతుతో సుమలత పలువురు మహిళలతో ఫోన్‌లో మాట్లాడి వలపు వల విసిరి మహిళలను లొంగదీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సెక్స్ టాయీస్‌తో మహిళలతో తన కోరికలు తీర్చుకొని అనంతరం వారికి నరకం చూపించినట్టు పిర్యాదులు వచ్చాయి. ఈ కేసులో అప్పట్లో సుమలతను అరెస్ట్ చేశారు ఒంగోలు పోలీసులు.
అప్పట్లో పెళ్లికాని యువతులు, కాలేజీ విద్యార్దినీలు, బాలికలనే లక్ష్యంగా సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. సాయితేజా రెడ్డి అలియాస్ సుమలత చేసిన వికృత చేష్టలతో రెండు రోజులపాటు చిత్రవద అనుభవించిన ఓ బాలిక ఫిర్యాదుతో సుమలత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమలత ట్రాప్‌లో పడ్డ యువతులు, బాలికలను సుమలత అలియాస్ సాయితేజా రెడ్డే కాకుండా ఆమెతో పరిచయం ఉన్న ఏడుకొండలు, వంశీ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో బయట పడటంతో వీరందరిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటి కేసులో తన భార్య సుమలత పట్టుబడటంతో అవమాన భారంతో ఆమెతో కలిసి ఉంటున్న ప్రియుడు ఏడుకొండలు ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి బర్తను వదిలేసి ఏడుకొండలు అనే వ్యక్తితో 7సంవత్సరాల పాటు సహజీవనం చేసింది సుమలత. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున సెక్స్ టాయిస్ బయటపడ్డాయి. అప్పట్లో అదో సంచలనం.
ఇప్పుడు రమ్యతో స్నేహం.. తాజాగా సుమలత టిక్‌టాక్ పేరుతో రమ్యకు దగ్గరైంది. ఆమెతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ప్రేమించుకుంటున్నట్టు, పెళ్ళి చేసుకున్నట్టు వీడియోలు తయారు చేసి టిక్‌టాక్‌లో పెట్టేది. ఈ వ్యవహారంలో రమ్య తల్లి అడ్డం తిరగడంతో పోలీసుల దగ్గరకు పంచాయతీ చేరింది. ఈ కేసులో మేజర్‌గా ఉన్న రమ్య నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. అయితే రమ్య, తాను ఇద్దరం స్నేహంగా ఉంటున్నామని, దీన్ని ఆసరాగా చేసుకున్న రమ్య తల్లి పది లక్షలు ఇవ్వాలని తనను డిమాండ్ చేయడంతో గొడవ మొదలైందని సుమలత చెబుతోంది. తామిద్దరి మధ్య ప్రేమ, పెళ్ళి వంటి వ్యవహారాలు లేవని, కేవలం స్నేహితులుగా కలిసి ఉంటున్నామని సుమలత చెబుతోంది.
సుమలతతోనే ఉంటానంటున్న రమ్య.. మరోవైపు రమ్మ కూడా ఇదే విధంగా చెబుతోంది. సుమలతతో తన బంధం సోదరితత్వమేనంటోంది. తమ మధ్య ప్రేమ, పెళ్ళి లేవంటోంది. తన మేమమామతో పెళ్ళి చేసేందుకు తన తల్లి ప్రయత్నించడంతో ఇష్టంలేక ఇంటి నుంచి బయటకు వచ్చి సుమలతతో కలిసి ఉంటున్నానంటోంది. తన తల్లి సుమలతను పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, అయితే తన తల్లి అమాయకురాలని, తన తల్లి వెనుక మరోవ్యక్తి ఉంటూ ఈ నాటకం ఆడిస్తున్నాడని చెబుతోంది. తాను ఇక ఇంటికి వెళ్ళేది లేదని, సుమలతతోనే ఉంటానని తేల్చి చెబుతోంది.
సుమలత పక్కా చీటర్ అంటున్న రమ్య తల్లి.. అయితే రమ్య తల్లి నాగమణి మాత్రం సుమలత మోసకారి అని ఆరోపిస్తోంది. తన కూతురు రమ్యను ట్రాప్ చేసిందని ఆరోపిస్తోంది. సుమలత చరిత్ర అంతా నేరమయమేనని, రమ్య ఆమె ట్రాప్‌లో పడిందని అంటోంది. తన కూతురు రమ్యను సుమలత పెళ్లి చేసుకున్నట్టు తనకు చెప్పిందని చెబుతోంది. సుమలత గతంలో కూడా పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిసిందని చెబుతోంది. తన బిడ్డ బుద్ది మార్చేసిందని, ఇప్పుడు సుమలత లేకుండా తాను ఉండలేనని రమ్య చెబుతోందని వాపోతోంది. తాను రమ్యను అప్పగించేందుకు పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నాగమణి చెబుతోంది.
ప్రేమ గుడ్డిదేనా.. సుమలత గత నేర చరిత్ర, తాజాగా రమ్యతో వివాదాస్పద సంబంధాల నేపధ్యంలో వీరిద్దరి కలయిక ఏవిధమైన మలుపు తీసుకుంటుందో వీరి ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రమ్య తమ ఇద్దరి మధ్య సంబంధాలను దాచిపెట్టి బయటకు మరో విధంగా చెబుతుంటే మాత్రం భవిష్యత్తులో రమ్య ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశాలు లేకపోలేదు.
Also read: