Russia – Ukraine War: గర్జిస్తున్న రష్యా.. నిలువెల్లా వణికిపోతోన్న ఉక్రెయిన్.. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..
Russia - Ukraine War: రష్యా గర్జిస్తోంది. యుద్ధ కాంక్షతో రగులుతోంది. ఉక్రెయిన్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రష్యా ఎటాక్స్‌తో ఉక్రెయిన్ నిలువెల్లా వణుకుతోంది.
Russia – Ukraine War: రష్యా గర్జిస్తోంది. యుద్ధ కాంక్షతో రగులుతోంది. ఉక్రెయిన్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రష్యా ఎటాక్స్‌తో ఉక్రెయిన్ నిలువెల్లా వణుకుతోంది. ఊహించని ఉత్పాతంతో ఉక్కపోతకు గురవుతోంది. ఉక్రెయిన్ కన్నీళ్లు పెడుతోంది. ఎటుచూసినా యుద్ధ భయంతో భీతిల్లిపోతున్నారు ఉక్రెయిన్ వాసులు. ఇక రష్యా దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతుండడం ప్రపంచాన్ని కలిచివేస్తోంది. నివాస ప్రాంతాలపై మెరుపు దాడులు కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారిగా మిగిలిపోతున్నారు.
వెనక్కి తగ్గినట్టే తగ్గిన రష్యా గోడకు కొట్టిన బంతిలా రివర్స్ ఎటాక్‌కు దిగింది. బలగాలన్నింటినీ ఉక్రెయిన్ వైపు నడిపిన పుతిన్.. తర్వాత కాస్త బ్యాక్‌స్టెప్ వేశారు. ఇక.. యుద్ధం ముగిసినట్టేనని అంతా భావించారు. తగ్గినట్టే కనిపించిన రష్యా.. ఉక్రెయిన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినట్టుగానే.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది రష్యా. ఇక రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ సతమతమవుతోంది. ఉక్రెయిన్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పార్లమెంట్, బ్యాంకులు, షాపింగ్ మాల్స్.. ఇలా ఒక్కటేమిటి వాణిజ్య, వర్తక సముదాయాలన్నీ మూతపడ్డాయి. మరోవైపు.. మాల్‌వేర్ దాడితో ఉక్రెయిన్ డేటా తుడిచిపెట్టుకుపోతోంది.
రష్యా యుద్ధోన్మాదంతో ఒక్క ఉక్రెయినే కాదు.. విదేశీయులూ ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్‌లో వివిధ దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్వదేశాలకు వెళ్లేందుకు వారికి మార్గం లేకుండా పోయింది. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు విదేశీయులు.
Also Read: