Viral News: నాడు చీరకట్టులో.. నేడు వెస్ట్రన్ డ్రెస్‌లో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ మహిళా అధికారి..!

Reena Dwivedi New Look: యూపీలో రీనా ద్వివేది అంటే తెలియని వారుండరు. సోషల్ మీడియా సంచలనం ఆమె. అలాగని ఆమే ఏదో సినీ స్టార్, పొలిటీషియన్ కాదండోయ్.

Viral News: నాడు చీరకట్టులో.. నేడు వెస్ట్రన్ డ్రెస్‌లో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ మహిళా అధికారి..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2022 | 5:08 PM

Reena Dwivedi New Look: యూపీలో రీనా ద్వివేది అంటే తెలియని వారుండరు. సోషల్ మీడియా సంచలనం ఆమె. అలాగని ఆమే ఏదో సినీ స్టార్, పొలిటీషియన్ కాదండోయ్. ఒక ప్రభుత్వ అధికారి మాత్రమే. యూపీ రాజధాని లక్నోలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న రీనా ద్వివేది తొలిసారి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారిగా విధులకు హాజరైన రీనా.. పసుపు రంగు చీర కట్టుకుని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ తళుక్కుమన్నారు. ఆ సమయంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

అయితే, తాజాగా రీనా ద్వివేది మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే, ఈసారి చీరకట్టులో కాదండోయ్.. పూర్తి వెస్ట్రన్ స్టైల్‌లోకి మారిపోయారామె. ఆమె స్టైల్, గెటప్ అంతా మార్చేశారు. కొత్త స్టైల్‌లో ఎన్నికల విధులకు హాజరై అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా యూపీలో దశల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. రీనా ద్వివేదికి ఈసారి లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ అసెంబ్లీలోని గోసాయిగంజ్ బూత్‌లో పోస్టింగ్ పడింది. దాంతో ఆమె ఎన్నికల విధులకు హాజరయ్యారు. గతంలో చీరకట్టుకుని వచ్చిన ఆమె.. ఈ సారి మాత్రం వెస్ట్రన్ డ్రెస్‌లో తళుక్కుమన్నారు. బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, వైట్ ప్యాంట్‌ ధరించిన రీనా.. ఈవీఎంను చేతపట్టుకుని నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సందర్భంగా పలువురు ఆమెను ఫోటో తీసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ట్రెండ్ సెట్టర్ అంటూ ఆ మహిళా అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా, వెస్ట్రన్ డ్రెస్ ధరించడంపై స్పందించిన రీనా.. ఈసారి తాను కొద్దిగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మార్పు మంచికేనంటూ కామెంట్ కూడా చేశారు. తన ఫోటోలు వైరల్ అయితే తనకు సంబంధం లేదని, తన విధులను తాను నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చింది రీనా ద్వివేది.

Also read:

Gold Rates Hike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా జంప్ అయిన గోల్డ్ రేట్.. ప్రస్తుత ధర ఎంతంటే..!

Viral Video: ప్రపంచం మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ పైనే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆరు భాషల్లో న్యూస్..

Ajith’s Valimai : వలిమై థియటర్ వద్ద పెట్రోల్ బాంబు దాడి.. అజిత్ ఫ్యాన్స్‌కు తీవ్రగాయాలు