Ajith’s Valimai : వలిమై థియటర్ వద్ద పెట్రోల్ బాంబు దాడి.. అజిత్ ఫ్యాన్స్‌కు తీవ్రగాయాలు

తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ రోజు ఫిబ్రవరి 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అజిత్ సినిమా కోసం ఈ ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.

Ajith's Valimai : వలిమై థియటర్ వద్ద పెట్రోల్ బాంబు దాడి.. అజిత్ ఫ్యాన్స్‌కు తీవ్రగాయాలు
Ajith Valimai
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2022 | 4:02 PM

Ajith’s Valimai : తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ రోజు ఫిబ్రవరి 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అజిత్ సినిమా కోసం ఈ ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. వలిమై థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సంబ‌రాల్లో ఆప‌శ్రుతి చోటు చేసుకుంది. మామూలుగానే అజిత్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. అదే విధంగా కోయంబ‌త్తూరులోని గంగ వ‌ల్లి మ‌ల్టీప్లెక్స్‌లో అజిత్ వ‌లిమై సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో ముగ్గురు దుండ‌గులు థియేట‌ర్‌లో పెట్రోల్ బాంబుల‌తో దాడి చేశారు.  బైక్ వ‌చ్చి స‌ద‌రు దుండ‌గులు బాంబుల‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అభిమానుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప‌ట్టుకోవ‌డానికి అజిత్ అభిమానులు ప్ర‌య‌త్నించారు. కానీ దుండ‌గులు త‌ప్పించుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని విచార‌ణ‌ను ప్రారంభించారు. దాడికి పాల్పడ్డ దుండగులు ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించారు.సినిమా రిలీజ్ కు ముందు పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగుతోపాటు..ఇతర భాషల్లోని అజిత్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాలో బైక్ రేసింగ్ స‌న్నివేశాలు మెస్మ‌రైజ్ చేస్తున్నాయ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. జీ స్టూడియోతో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్ బ్యాన‌ర్‌పై బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Nithya Menon: నిత్యయవ్వన మకరందం ‘నిత్యామీనన్’.. బూరె బుగ్గల చిన్నదాని నయా ఫొటోస్ అదుర్స్..

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!