Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: వచ్చేస్తున్నాయ్ వానలు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు అలెర్ట్

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మూడు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

AP Weather: వచ్చేస్తున్నాయ్ వానలు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు అలెర్ట్
Weather
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2024 | 3:38 PM

Share

ఆగ్నేయ బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం మీదుగా ఒక ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో అక్టోబర్ 14 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం , ఇపుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో..  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-

శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రూ.80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ
రూ.80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ
IDP కోర్సులకు JNTU మంగళం.. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు తొలగింపు!
IDP కోర్సులకు JNTU మంగళం.. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు తొలగింపు!
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?