AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Heavy Rains: రానున్న 48 గంటలు ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు!

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది.

AP Heavy Rains: రానున్న 48 గంటలు ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు!
Balaraju Goud
|

Updated on: Aug 29, 2021 | 3:25 PM

Share

Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది.

రుతుపవన ద్రోణి అల్పపీడనం గుండా ఆగ్నేయ దిశగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడనున్నాయి. ఇవాళ విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ, రేపు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. గత 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మ లక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8 సెంటీమీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది. అల్పపీడనం(Low Depression) కారణంగా తూర్పు, విశాఖ జిల్లాల్లో భారీ వర్షసూచన జారీ అయింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర యానాం: ఇవాళ ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దక్షిణ కోస్తా ఆంధ్ర : అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

రాయలసీమ: ఇక, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also…. అరుదైన గౌరవం దక్కించుకున్న పీవీ సింధుకు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోస్.. : P.V.Sindhu Party Photos.