AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చేపలకోసం వల వేసిన మత్స్యకారుడు.. బయటకు లాగి చూస్తే షాక్.. రెండు చేతులెత్తి దండం పెట్టారు..!

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు కలకలం రేపాయి. హిరమండలం గొట్టాబ్యారేజీ దిగువున వంశధార నదిలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయుని విగ్రహాలు మత్స్య కారుడి వలకు దొరికాయి. భగీరధపురంకి చెందిన పూలసరి శంకరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం నదిలో వల వేయగా వలకు బరువుగా తగిలింది.దాంతో కష్టం మీద వలను పైకి లాగి చూడగా వలలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు లభ్యమయ్యాయి.

Andhra Pradesh: చేపలకోసం వల వేసిన మత్స్యకారుడు.. బయటకు లాగి చూస్తే షాక్.. రెండు చేతులెత్తి దండం పెట్టారు..!
Fishermen Hunting
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Aug 29, 2023 | 11:15 AM

Share

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు కలకలం రేపాయి. హిరమండలం గొట్టాబ్యారేజీ దిగువున వంశధార నదిలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయుని విగ్రహాలు మత్స్య కారుడి వలకు దొరికాయి. భగీరధపురంకి చెందిన పూలసరి శంకరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం నదిలో వల వేయగా వలకు బరువుగా తగిలింది.దాంతో కష్టం మీద వలను పైకి లాగి చూడగా వలలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని చూసిన మత్స్యకారుడు ఏం చెయ్యాలో తెలియక వాటిని తిరిగి నదిలో వేసేశాడు.

తరవాత జరిగిన విషయం స్థానికులకు చెప్పగా మిగిలిన మత్స్యకారులతో కలిసి తిరిగి నదిలో వెతకగా లక్ష్మి దేవి,గణపతి విగ్రహాలు మాత్రమే దొరికాయి. హనుమంతుని విగ్రహం కోసం వెతికినా దొరకలేదు. అలా దొరికిన లక్ష్మి,గణపతి విగ్రహాలను స్థానికంగా ఉన్న గొట్ట పోలమ్మ ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు స్థానికులు. నదిలో విగ్రహాలు దొరకటంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.వాటిని చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోలమ్మ ఆలయానికి చేరుకుంటున్నారు. నదిలో విగ్రహాలు దొరకటం భగవంతుని మహిమగా స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దొరికిన విగ్రహాలు ఏ కాలం నాటివి, ఏ లోహంతో తయారు చేయబడ్డవి వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..