Tirumala: స్వామివారు అడిగినట్లు అనిపించిందట.. దీంతో కిలో బంగారం, వజ్రాలతో..
హైదరాబాద్ ‘నీలోఫర్ కేఫ్’ యజమాని బాబూరావు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. కేవలం ఒక నెల రోజుల్లోనే తయారు చేయించి టీటీడీకి అందించారు. రూ.4.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... .. ..

తిరుమల వెంకన్నకు భక్తులు నిత్యం ఏవో ఒక కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజాగా హైదరాబాద్ నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబూరావు.. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత విలువైన కానుక అందజేశారు. ఆయన శ్రీనివాసుడికి ప్రత్యేకంగా వజ్రాలతో తయారు చేయించిన పసిడి యజ్ఞోపవీతాన్ని అంజేశారు.
గతంలో దేవదేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు.. ‘యజ్ఞోపవీతం సమర్పిస్తావా?’ అని వెంకన్న స్వామి అడిగి భావవ కలిగినట్లు బాబూరావు తెలిపారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే.. ఎంతో భక్తితో ఈ ఆభరణాన్ని తయారు చేయించి ఇచ్చినట్లు చెప్పారు. సుమారు కిలో బంగారంతో పాటు, కోటి రూపాయల విలువైన వజ్రాలను ఈ ఆభరణానికి వినియోగించినట్లు తెలుస్తోంది. స్వామి వారికి సమర్పించిన ఈయజ్ఞోపవీతం విలువ దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు ఉంటుందని బాబూరావు చెప్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




