భార్య వేరొకరితో మాట్లాడుతోందని.. కత్తితో విచక్షణ రహితంగా పొడిచి.. ఆపై
ఆ దంపతుల మధ్య అనుమాన భూతం చిచ్చు రేపింది. భార్య వేరొకరితో మాట్లాడుతోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం గురించి భార్యతో గొడవపడ్డాడు...
ఆ దంపతుల మధ్య అనుమాన భూతం చిచ్చు రేపింది. భార్య వేరొకరితో మాట్లాడుతోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం గురించి భార్యతో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలు మరింత ఎక్కువ కావడంతో.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు రాత్రి భార్యతో గొడవపడి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. సమచారం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం(Tadepalligudem) లోని భాగ్యలక్ష్మిపేటకు చెందిన దేవరాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మికి ఆరోగ్య సమస్యలున్నాయి. ఆమెకు వైద్యం చేయించేందుకు చాలా చోట్లు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మూడేళ్ల క్రితం దుబాయ్(Dubai) వెళ్లాడు. ఈ క్రమంలో మూడు నెలల సెలవులపై జనవరి 28న ఇంటికి వచ్చాడు.
మరోవైపు సుబ్బలక్ష్మి తరచూ దుబాయ్‌లోని ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండటాన్ని దేవరాజు గమనించాడు. ఈ విషయంపై భార్యను ఆరా తీశాడు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వారిద్దరి మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఓ రోజు రాత్రి దేవరాజు.. కత్తితో భార్యను విచక్షణా రహితంగా పొడిచాడు. సుబ్బలక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూసే సరికి..ఆమె అపస్మారక స్థితిలోకి పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Ganga Nayak: మున్సిపల్ ఎన్నికలో మెరిసిన గంగ.. కార్పోరేటర్‌గా తొలిసారి ట్రాన్స్‌జెండర్ విజయం..
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐలతో ఎలాంటి లాభం ఉంటుంది..? ఇదంతా ప్లానేనా..?