AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న తండ్రిపై కర్కశత్వం.. గొంతుపై కత్తితో పొడిచి.. మృతదేహాన్ని సంచిలో కుక్కి

భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు. దీనికి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. అయినా అతను తన ప్రవర్తన మార్చుకోలేదు. వారితో గొడవ పడి వారికి దూరంగా వెళ్లిపోయి..

కన్న తండ్రిపై కర్కశత్వం.. గొంతుపై కత్తితో పొడిచి.. మృతదేహాన్ని సంచిలో కుక్కి
Father Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 24, 2022 | 12:33 PM

Share

భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు. దీనికి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. అయినా అతను తన ప్రవర్తన మార్చుకోలేదు. వారితో గొడవ పడి వారికి దూరంగా వెళ్లిపోయి పెళ్లి(Marriage) సంబంధాల కోసం ప్రయత్నించాడు. వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని, ఆస్తి దక్కదని భావించిన కుమారుడు తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్న వ్యక్తినే పావుగా వాడుకున్నాడు. అతనికి సుపారీ ఇచ్చి హత్య(Murder) చేయించాడు. ముందస్తు పథకం ప్రకారం స్పాట్ కు రప్పించాడు. అనంతరం గొంతు కోసి దారుణంగా చంపారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి కాల్వలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు(Arrest) చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఆయుధాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కూకటికొండకు చెందిన గొల్ల గోపాల్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. గోపాల్‌ భార్య మృతి చెందడంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతని కుమారులు, కుమార్తెలు అభ్యంతరం తెలిపారు. దీంతో గోపాల్ వారితో గొడవ పడి కర్నూలులో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో రెండో పెళ్లి సంబంధాలు చూడాలని.. సింగాపురం గ్రామానికి చెందిన పలువురిని కోరాడు. విషయం తెలిసుకున్న గోపాల్ పెద్ద కుమారుడు తన తండ్రికి పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పాడు. తండ్రిని హత్య చేసేందుకు ఈరన్న అనే వ్యక్తికి రూ.1.50 లక్షలు సుపారీ ఇస్తానని వివరించాడు. సుపారిని అంగీకరించిన ఈరన్న ఈనెల 14 న గోపాల్‌కు ఫోన్‌ చేశాడు. ఎమ్మిగనూరు రావాలని కోరాడు.

ముందస్తు పథకం ప్రకారం గోపాల్ కుమారుడు బాలరంగడు, కుమ్మరి ఈరన్న, మరో వ్యక్తిని వెంటబెట్టుకుని బైక్ పై ఎల్‌ఎల్‌సీ కాల్వ వద్దకు చేరుకున్నారు. బాలరంగడుని అక్కడే దించేసి మిగతా ఇద్దరూ ఎమ్మిగనూరు వెళ్లారు. గోపాల్‌ను తీసుకొని ఎల్‌ఎల్‌సీ కాల్వ వద్దకు తీసుకొచ్చారు. గోపాల్ గొంతుపై దారుణంగా పొడిచి హత్య చేశారు. శవాన్ని గోనె సంచిలో మూటకట్టి కాల్వలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. కన్న కొడుకే తండ్రిని హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని తెలుసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధరించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, రూ.25 వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read

Sridevi Death Anniversary: అతిలోక సుందరి శ్రీదేవి మూడో వర్థంతి

CUTN Non Teaching Staff jobs: డిగ్రీ అర్హతతో.. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ జాబ్స్‌..

Viral Video: విమానాశ్రయంలో ఎయిర్‌ హోస్టెస్‌ స్టెప్పులకు నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న వీడియో